ఇలా ఎందుకు చేశావ్‌ అనీల్‌ అంటున్న బండ్ల గణేష్‌  

Bandla Ganesh Re Entry In Sarileru Nikevvaru-bandla Ganesh,bandla Ganesh In Blade Babji,bandla Ganeshintroudction,mahesh Babu And Bandla Ganesh

కమెడియన్‌ నుండి నిర్మాతగా మారి, ఇప్పుడు నిర్మాత నుండి మళ్లీ కమెడియన్‌గా మారిన బండ్ల గణేష్‌ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చాలా కీలకమైన ట్రైన్‌ ఎపిసోడ్‌లో బండ్ల గణేష్‌ ఉంటాడని, ఆయన కామెడీతో అందరిని నవ్విస్తాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి ప్రచారం చేయడం జరిగింది.

Bandla Ganesh Re Entry In Sarileru Nikevvaru-bandla Ganesh,bandla Ganesh In Blade Babji,bandla Ganeshintroudction,mahesh Babu And Bandla Ganesh Telugu Tollywood Movie Cinema Film Latest News-Bandla Ganesh Re Entry In Sarileru Nikevvaru-Bandla Bandla Blade Babji Ganeshintroudction Mahesh Babu And

దొంగగా బండ్ల గణేష్‌ ఈ చిత్రంలో కనిపిస్తాడు.అయితే సినిమాలో ఆయన పాత్ర చాలా తక్కువగా ఉండటం ప్రేక్షకులను నిరాశ పర్చింది.


తాజాగా బండ్ల గణేష్‌ మాట్లాడుతూ సినిమాలో నా పాత్రను పూర్తిగా తొలగించినా పెద్దగా ఫీల్‌ అయ్యేవాడిని కాదు.కాని పాత్రను మరీ కట్‌ చేసి దానికి ఒక అర్థం లేకుండా చూపించారు.

సడెన్‌గా తీసుకు రావడంతో ప్రేక్షకులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.నా పాత్ర ఇంట్రడక్షన్‌ సీన్‌ ఉంటుంది.ఆ సీన్‌ లేకపోవడంతో నా పాత్రకు అర్థం లేకుండా పోయిందని, దర్శకుడు అనీల్‌ ఇలా చేస్తాడనుకోలేదు అంటూ బండ్ల గణేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలాంటి రీ ఎంట్రీ దక్కుతుందని ఊహించలేదు అంటూ బండ్ల బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు