బండ్ల గణేష్ మనసు బంగారం.. ఆ పని చేసి నెటిజన్స్ మనసు దోచేశాడుగా?

Bandla Ganesh Adopted A Child Netizen Comments Viral

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, నిర్మాతగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బండ్లగణేష్ ఇటీవలే హీరోగా కూడా మారాడు.ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం అతనిది.

 Bandla Ganesh Adopted A Child Netizen Comments Viral-TeluguStop.com

ఇతను పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద వీరాభిమానో అందరికి తెలిసిందే.బండ్ల గణేష్ కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో సాయం అని అడిగిన వారికి లేదనకుండా తన వంతు సహాయాన్ని అందించి మంచి మనసును చాటుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 Bandla Ganesh Adopted A Child Netizen Comments Viral-బండ్ల గణేష్ మనసు బంగారం.. ఆ పని చేసి నెటిజన్స్ మనసు దోచేశాడుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తాను ఒక నేపాలి పాపను పెంచుకుంటున్నట్లు తెలిపారు.

అందరూ కుక్కలు, పిల్లులు కొనుక్కుని వచ్చి వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.కానీ నేను ఈ పాపని పెంచుకుని గొప్పగా చదివించాలి అనుకుంటున్నాను అంటూ తెలిపారు.

తన భార్య చెప్పిందనే ఈ నేపాలి పాపను దత్తత తీసుకున్నానని చెప్పారు బండ్లగణేష్.

ప్రస్తుతం ఆ పాప తన ఇంట్లో ఒక మెంబర్ అయిపోయిందని, అందర్నీ కూడా బెదిరించే స్థాయికి ఎదిగిందని తెలిపారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ప్రస్తుతం బండ్ల గణేష్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ బండ్లగణేష్ మనసు బంగారం అంటూ కామెంట్లు చేయగా మరోక నెటిజన్ అన్న నిన్ను నిందించి, అగౌరవపరిచే అంత స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కరికి లేదు అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ఆలోచింపజేస్తుంది.కరోనా సమయం తర్వాత మరొకసారి ఇలా అందరి ప్రశంసలు అందుకున్నారు బండ్ల గణేష్

.

#Nepali #Bandla Ganesh #Bandla Ganesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube