బీజేపీని ఒక్కడై నడిపిస్తున్న బండి సంజయ్.. వర్గ విభేధాలే కారణమా?

బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా మంచి పేరున్న నాయకుడు.బీజేపీలో ఇన్నేళ్లుగా తెలంగాణలో ఉన్నా ఒక్కసారి కూడా బలపడింది లేదు.

 Bandi Sanjay Who Is Leading The Bjp Alone Due To Group Politics ,bjp Party, Tela-TeluguStop.com

అప్పటి వరకు క్లాస్ లీడర్లుగా పేరున్న లక్ష్మణ్, కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్న సమయంలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల యాత్ర చేపట్టినప్పటికీ అంతలా బీజేపీకి బలపడడానికి ఎటువంటి అవకాశాలు కనపడలేదు.కాని బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ అధికారం చేపట్టిన తరువాత ఒక్కసారిగా బీజేపీ దశ తిరిగిందని చెప్పవచ్చు.

కార్యకర్తలలో మాస్ లీడర్ గా పేరున్న బండి సంజయ్ తీవ్ర పదజాలంతో అసలు ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పించడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు పడింది.అయితే బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ కు వేరే వర్గానికి పడడం లేదు.

అంతర్గత విబేధాలతో అధ్యక్షునిగా బండి సంజయ్ వ్యూహాలకు మద్దతిచ్చే వారే కరువయ్యారు.అందుకే ఈ ప్రతి ఎన్నికల్లో బండి సంజయ్ మాత్రమే చివరి వరకు ప్రచారంలో ఉంటారు.

లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రామ చంద్ర రావు లాంటి నేతలు బండి సంజయ్ కి మద్దతుగా నిలబడకాపోవడంతో ఇక తప్పక ఒంటరిగా పోరాడకుండా తప్పడం లేదు.మరి ఈ లకలుకలు బీజేపీలో ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube