ఈటల రాజేందర్ ని పరామర్శించిన బండి సంజయ్ పలువురు బీజేపీ నేతలు..!!

మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మంత్రిగా తాను ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తూ అదే రీతిలో ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ను బయటకు తీసుకొచ్చిలా.

 Bandi Sanjay Visited Eetela Rajender-TeluguStop.com

ప్రజలను ఆకర్షించేలా  పాదయాత్రలో భాగంగా ఈటల ఇంటింటికి తిరుగుతూ వివరిస్తూ వస్తున్నారు.ఎలాగైనా హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలవాలని సత్తా చాటాలని పాదయాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈటల తాజాగా అస్వస్థతకు గురయ్యారు.

దీంతో పార్టీ నాయకులు మొదట నిమ్స్ లో జాయిన్ చేయగా తర్వాత హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో ఈటల రాజేందర్ నీ ఆసుపత్రిలో పరామర్శించడానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు రావడం జరిగింది.

 Bandi Sanjay Visited Eetela Rajender-ఈటల రాజేందర్ ని పరామర్శించిన బండి సంజయ్ పలువురు బీజేపీ నేతలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యులను ఈటల రాజేందర్ యొక్క ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలో ఈటల ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ పాదయాత్ర స్టార్ట్ అవుతుందని ఈ లోపు మిగతా బిజెపి పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు హుజూరాబాద్ నియోజకవర్గం లో కొనసాగుతాయని బిజెపి నాయకులు తెలిపారు.

#Appolo Hospital #Bandi Sanjay #Bjp #Bjp #Etala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు