'బండి ' ని వెనక్కి లాగే ప్రయత్నాల్లో సొంత నేతలు ?

తెలంగాణ లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడం లో బిజెపి సక్సెస్ అవుతోంది.

 Bandi Sanjay Troubled On Group Politics On Telangana Bjp , Telangana Bjp, Bandi Sanjay, Trs, Kcr, Ktr, Telangana Bjp Group Politics, Bandi Sanjay Troubles, Amith Sha, Narendra Modhi,-TeluguStop.com

ఒకవైపు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా తట్టుకుంటూ బీజేపీని బలోపేతం చేయడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అవుతున్నారు.బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రోజు రోజుకు పార్టీ బలోపేతం అవుతూ వస్తోంది.

పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకోవడం తో పాటు , టిఆర్ఎస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా బిజెపిని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు.అయితే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నుంచి కంటే సొంత పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Bandi Sanjay Troubled On Group Politics On Telangana Bjp , Telangana BJP, Bandi Sanjay, TRS, Kcr, Ktr, Telangana Bjp Group Politics, Bandi Sanjay Troubles, Amith Sha, Narendra Modhi,-బండి ని వెనక్కి లాగే ప్రయత్నాల్లో సొంత నేతలు -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంజయ్ దూకుడుతో తెలంగాణలో బీజేపీ బలపడుతూ… రోజురోజుకు బలం పెంచుకుంటూ ఉండడంతో,  బీజేపీ అధిష్టానం పెద్దల వద్ద సంజయ్ పలుకుబడి బాగా పెరిగింది.దీంతో సంజయ్ హవాను దెబ్బతీసేందుకు బిజెపిలోని కొంతమంది కీలక నాయకులు ఆయనకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తుండడం పై సంజయ్ అసంతృప్తితో ఉన్నారు.

ఈ విషయమై పార్టీ అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా తనపై బురదజల్లే విధంగా సొంత పార్టీ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారనే విషయాన్ని సంజయ్ గ్రహించారు.మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో నిర్వహించబోతున్నారు.
    3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు.ఈ వ్యవహారాల్లో బండి సంజయ్ బిజీగా ఉంటుండడంతో , ఆయనను మానసికంగా దెబ్బ తీసేందుకు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు ప్రయత్నాలు చేస్తూ రకరకాల మార్గాల ద్వారా సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట.అంతేకాకుండా చేరికల విషయంలోనూ ఎక్కువగా సంజయ్ దృష్టి పెట్టడంతో,  వాటిని అడ్డుకునేందుకు సొంత పార్టీ నాయకులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇటీవల బీజేపీలో జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాణి రుద్రమదేవి , సామా వెంకట్ రెడ్డి వంటి పేరున్న నాయకులు బిజెపిలో చేరారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Bandisanjay, Narendra Modhi, Telangana Bjp-Political

ఆ తర్వాత నుంచి పెద్దగా చేరికలు లేవు.చాలామంది బీజేపీ లోకి వచ్చేందుకు ప్రయత్నించినా,  గ్రూపు రాజకీయాల కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలామంది కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతూ ఉండడంతో ఈ వ్యవహారాలపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కొంతమంది కీలక నాయకులకు వ్యతిరేకంగా బిజెపి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడంతో,  వారిపై తగిన చర్యలు తీసుకోవడమా లేక సంజయ్ కు ఏ విషయంలోనూ అడ్డు రాకూడదనే వార్నింగ్ అయినా ఇస్తే కానీ తాను చురుగ్గా పనిచేసుకునేందుకు అవకాశం ఉండదు అనే అభిప్రాయంలో ఆయన ఉన్నారట.

తెలంగాణ బీజేపీ లో చోటు చేసుకున్న గ్రూపు రాజకీయాల పై బీజేపీ అధిష్టానం సైతం సీరియస్ గా ఉందట. 

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube