తెలంగాణ బీజేపీ కొత్త ఛీఫ్‌ రేసులో యువ ఎంపీ  

Bandi Sanjay Telangana Bjp New Chief-bandi Sanjay,bjp Mp Bandi Sanjay,lakshman

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుంది.గతంతో పోల్చితే బీజేపీ రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది.గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి...

Bandi Sanjay Telangana Bjp New Chief-bandi Sanjay,bjp Mp Bandi Sanjay,lakshman-Bandi Sanjay Telangana BJP New Chief-Bandi Bjp Mp Lakshman

కాని నాలుగు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుని సత్తా చాటింది.హైదరాబాద్‌లో కూడా బీజేపీ బలం అనూహ్యంగా పెరిగిందని టాక్‌ వినిపిస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో కాస్త శ్రద్దగా పార్టీని పెంచుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానం పోషించే అవకాశం ఉంటుందని అధినాయకత్వం భావిస్తుంది.

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కొత్త ఛీఫ్‌ను నియమించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా భావిస్తున్నాడు.ప్రస్తుతం లక్ష్మణ్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు.మరోసారి తనకే అవకాశం కావాలని ఆయన కోరుకుంటున్నాడు.

Bandi Sanjay Telangana Bjp New Chief-bandi Sanjay,bjp Mp Bandi Sanjay,lakshman-Bandi Sanjay Telangana BJP New Chief-Bandi Bjp Mp Lakshman

కాని అమిత్‌ షా మాత్రం కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఇటీవల కరీంనగర్‌ నుండి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నారట.ఆయనకు యూత్‌లో మంచి ఫాలోయంగ్‌ ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులను కార్యకర్తలను ఆయన కలుపుకు పోవడంతో పాటు పార్టీని పెంచగల సామర్ధ్యం ఉందని భావిస్తున్నారు.ఈయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి మద్దతు ఉంది.మరి కొన్ని రోజుల్లోనే కొత్త ఛీప్‌ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.