శాటిలైట్ చిత్రాలతో బండి సంజయ్ కి షాక్...టీఆర్ఎస్ వ్యూహం ఇదేనా?

రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా సహజం.కాని ఎక్కడో ఒక చోట మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది.

 Bandi Sanjay Shocked By Satellite Images ... Is This A Trs Strategy Telangana Po-TeluguStop.com

అందుకు ప్రధాన సాక్ష్యం బండి సంజయ్ తెలంగాణ లో వరి సాగుపై చేసిన వ్యాఖ్యలే అని చెప్పవచ్చు.తెలంగాణలో అత్యధికంగా సాగయ్యేది వరి అన్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా తెలంగాణలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రాలలో ఒకటి అని చాలా రకాల సందర్భాలలో తెలిపిన విషయం తెలిసిందే.అయితే ఇటీవల కెసీఆర్ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రితో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ తెలంగాణలో 60 లక్షల వరి సాగు పండడం లేదని శాటిలైట్ చిత్రాల్లో కనిపించడం లేదని కేంద్ర మంత్రి అన్న మాటలు విలేఖరుల సమావేశంలో కెసీఆర్ ప్రస్తావించారు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Telangana-Political

అయితే బండి సంజయ్ కు హెలికాప్టర్ లు ఏర్పాటు చేస్తానని నిపుణులను పంపిస్తానని 60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కావట్లేదని నిరూపించగలరా అని కెసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ తెలంగాణలో దాదాపు 58.60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోందని అధికారికంగా తెలిపింది.అయితే ప్రస్తుతం చాలా వరకు బండి సంజయ్ వ్యాఖ్యలకు కేంద్ర వ్యవసాయ శాఖనే  కౌంటర్ ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.దీంతో ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికను చూపిస్తూ, కేంద్రం పూర్తి ధాన్యాన్ని కొంటున్నట్టు స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఈ రెండు అంశాలతో భవిష్యత్ లో బీజేపీని కెసీఆర్ ఇరుకున పెట్టె అవకాశం వందకు వంద శాతం ఉంది.

మరి బీజేపీ కెసీఆర్ ప్రస్తావించబోయే  ఈ రెండు అంశాలతో ఎలా సమర్థించుకుంటుందనేది చూడాల్సి ఉంది.ఇక కోతలు మొత్తం పూర్తయ్యాక పరిస్థితులు ఇంకా వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube