కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ??- Bandi Sanjay Sensational Comments On Kcr Kaleshwaram Tour

bandi sanjay sensational comments on kcr kaleshwaram tour, Bandi Sanjay, comments, ,KCR, Kaleshwaram - Telugu Bandi Sanjay, Comments, Kaleshwaram, Kcr

తెలంగాణాలో రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా లేనట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల త్రిముఖ మాటల యుద్ధం రోజు రోజుకు ముదిరిపోతుంది.

 Bandi Sanjay Sensational Comments On Kcr Kaleshwaram Tour-TeluguStop.com

ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్దాయిలో ఉన్నారు.ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ ని సీఎం చేయడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించి, పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కాళేశ్వరానికి వెళ్లారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో టీఎంసీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ దానివల్ల వచ్చే లాభమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 Bandi Sanjay Sensational Comments On Kcr Kaleshwaram Tour-కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేటీఆర్ సీఎం కావాలని తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కోరుకుంటున్నారని, నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న సీయం కొడుక్కి ఆ పదవి కట్టబెట్టడం ఆయనకే చెల్లుతుందని ఎద్దేవ చేశారు.

ప్రజల కోసం ఆలోచించని సీయం బహూశా ప్రపంచంలో మీరొక్కరే కావచ్చూ అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.

#Kaleshwaram #Bandi Sanjay #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు