కేసీఆర్ జైలుకే అంటూ బీజేపీ బెదిరింపులు ! వారి కోసమేనా ? 

త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్ళబోతున్నారు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు.ఇప్పుడే కాదు గతం నుంచి బండి సంజయ్ కెసిఆర్ పై ఇదే రకమైన బెదిరింపులకు దిగుతూ వచ్చారు.

 Bandi Sanjay Sensational Comments On Kcr Kcr, Trs, Kcr Jail, Bandi Sanjay, Telan-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడం వెనుక కారణాలు అయితే చాలా ఉన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది.మొదట్లో ఈ హడావుడి ఎక్కువగా చేసిన సంజయ్ ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపధ్యంలో సైలెంట్ అయిపోయారు.

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉండడం, ఆయనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ కీలక నాయకులు ఆయన వెంట నడవబోతుండడంతో బిజెపి మరి కొంతమందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.అయితే రాజేందర్ తో పాటు మిగిలిన నాయకులలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు బీజేపీలో చేరినా, భవిష్యత్తులో టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమ పరిస్థితి ఏమిటి అనే సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.ఇదే విషయాన్ని ఈటెల రాజేందర్ బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వద్ద ప్రస్తావించడంతో బిజెపి టిఆర్ఎస్ మధ్య ఎప్పుడు శతృత్వమే ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు అదే విషయం రుజువు చేసేందుకు కేసీఆర్ టీఆర్ఎస్ బీజేపీ వైపు వచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.అయితే కెసిఆర్ జైలుకు వెళ్తారు అనే విషయాన్ని ఆషామాషీగా అయితే చెప్పడం లేదు .దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయని,  లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నామని, తాము కెసిఆర్ అక్రమాలపై లోతుగా అధ్యయనం చేయడంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అని , కేసిఆర్ ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో తెలిసిందంటూ సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Bandi Sanjay, Enuguravindra, Etela Rajender, Jp Nadda, Kcr Jail, Telangan

కేవలం కేసీఆర్ మాత్రమే కాకుండా 18 మంది టిఆర్ఎస్ నాయకుల అవినీతి వ్యవహారాలపై తాము అధ్యయనం చేశామని సంజయ్ ప్రకటించడం సంచలనంగా మారింది.గతంలో కెసిఆర్ జైలుకి వెళ్తారు అనే విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు సంజయ్ వ్యక్తిగతమని , దీనికి పార్టీతో సంబంధం లేదంటూ మాట్లాడారు.అయితే ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతో మాట్లాడుతుండటం చూస్తుంటే కెసిఆర్ జైలుకు వెళ్తారా లేదా అనే విషయం పక్కన పెడితే టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలకు ఇచ్చేందుకు భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ బిజెపి మధ్య ఎటువంటి మిత్రుత్వం ఉండదు అని విషయాన్ని రుజువు చేసుకునేందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు గా అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube