యూపీలో మాదిరి తెలంగాణలో ఆ చట్టం తీసుకొస్తామని అంటున్న బండి సంజయ్..!!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు ఇప్పటికే వంద కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 Bandi Sanjay Says That The Law Will Be Brought In Telangana Like In Up Bjp, Band-TeluguStop.com

ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కచ్చితంగా బిజెపి అధికారంలోకి వస్తుందని అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఒక్కరు చాలు.

ఇద్దరు హద్దు..

ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం అంటూ చెప్పుకొచ్చారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడానికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నా, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తూ కేసీఆర్ చట్టం తీసుకురావాలని చూశారు.బిజెపి అడ్డుకోవడంతో భయపడి వెనక్కు తగ్గారు.

దమ్ముంటే బిల్లు పెట్టి చూడు.ఎక్కడ అడ్డుకోవాలో,అక్కడ అడ్డుకుని తీరుతాం.అంటూ సోషల్ మీడియాలో బండి సంజయ్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube