తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల రాజకీయ రణరంగం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విమర్శలు, బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ విమర్శలతో పెద్ద ఎత్తున విమర్శల పరంపర అనేది కొనసాగుతోన్న పరిస్థితి ఉంది.
అయితే గత నెల రోజులుగా రాష్ట్రంలో ఇంతలా రాజకీయ హైడ్రామా జరుగుతున్నా కేసీఆర్ ఏ మాత్రం స్పందించని పరిస్థితి ఉంది.అయితే బీజేపీ పార్టీ మాత్రం ఇదే అదునుగా తనదైన శైలిలో దూకుడు పెంచుతూ రోజురోజుకు మరింతగా బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఏ మాత్రం స్పందించకపోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది.బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల బీజేపీ వ్యవహార శైలి పట్ల టీఆర్ఎస్ చాలా నిశితంగా స్పందిస్తున్నా పెద్దగా వ్యూహాన్ని మాత్రం బయట పెట్టడం లేదు.
ఎందుకంటే విమర్శలు, ప్రతి విమర్శలతో రాను రాను బీజేపీ, కేసీఆర్ సమానం అనే భావన ప్రజల్లో వ్యక్తమయితే ఇక ప్రజలు టీఆర్ఎస్, బీజేపీని పోల్చడం ప్రారంభిస్తే ఇక టీఆర్ఎస్ పార్టీ మరింతగా శ్రమించాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది.ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇలా బీజేపీ దూకుడుకు కౌంటర్ ఇవ్వలేక వెనుకడుగు వేస్తుందని ఎవరూ ఊహించని పరిస్థితి ఉంది.
ఎందుకంటే సుదీర్ఘమైన పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక పోతున్నదా అనే సందేహం వస్తున్న పరిస్థితి ఉంది.అయితే గత ఎన్నికల్లో కూడా అచ్చం ఇలాంటి రాజకీయ వాతావరణం ఉందని కాని టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.