పవన్ కళ్యాణ్ వ్యవహారం తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారిందా?

రెండు తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి పొత్తు కొనసాగుతోంది.అయితే పార్టీల మధ్య ఒక్కసారి పొత్తు కాని, అంగీకారం కాని కుదిరితే వాటికి ఇరు పార్టీలు కట్టుబడి ఉండాలి.

 Bjp Chief Bandi Sanjay Reaction To Pawan Kalyan Comments, Bjp Chief Bandi Sanjay-TeluguStop.com

అలా ఉంటేనే ఇరు పార్టీల మధ్య సఖ్యత అనేది కుదురుతుంది.అప్పుడే ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వ్యూహాన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తే ప్రజల్లో కాని ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది.

అలా లేకపోతే ఎన్ని సంవత్సరాలు పొత్తు పెట్టుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు.ప్రస్తుతం ఇలాగే ఉంది బీజేపీ, జనసేన పొత్తు పరిస్థితి.

తెలంగాణలో జనసేనతో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో కలిసి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఆ సమయంలో తెలంగాణ రాజకీయాలలో రకరకాల విషయాలపై చర్చించుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ నిన్న అకస్మాత్తుగా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది.అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.

అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మద్దతు తెలిపి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు తెలపడంలో ఆంతర్యమేమిటని బండి సంజయ్ మండిపడ్డారు.బీజేపీతో ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకరావాలని బండి సంజయ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube