తాజా రాజకీయాలపై మౌనం వహిస్తున్న బండి సంజయ్... అసలు కారణం ఇదే?

తెలంగాణ రాజకీయాలలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడంలో బీజేపీ విజయం సాధించింది.ఎలాగూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో దుబ్బాకలో గెలిచి బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది.

 Bandi Sanjay Is Silent On The Latest Politics Is This The Real-TeluguStop.com

అయితే తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.ఎల్లప్పుడూ రాష్ట్ర రాజకీయాలపై యాక్టివ్ గా స్పందించే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మౌనం వహిస్తున్నాడు.

ప్రస్తుతం కోవిడ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 Bandi Sanjay Is Silent On The Latest Politics Is This The Real-తాజా రాజకీయాలపై మౌనం వహిస్తున్న బండి సంజయ్… అసలు కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం కోవిడ్ సమస్యపై స్పందించడం లేదు.

అయితే ఇప్పుడు కోవిడ్ సమస్యపై స్పందిస్తే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.అయితే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్న తరుణంలో తెలంగాణలో కోవిడ్ సమస్యపై స్పందిస్తే బీజేపీ ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.

అందుకే బీజేపీ నేతలు మిశ్రమంగా స్పందిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కరోనా కట్టడిలో మోడీ విఫలమవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కొంత మేర మౌనం వహించాలని నిర్ణయింకున్నట్టు  తెలుస్తోంది.

#@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు