పవన్ అవసరం లేదంటూ హింట్ ఇస్తున్న బీజేపీ ?

జనసేన విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా, తమ రాజకీయ అవసరాల కోసం పవన్ ను వాడుకుంటున్నా, ఇవ్వాల్సినంత స్థాయిలో గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు అనేది ఆ పార్టీ పై జనసేన ప్రధాన ఫిర్యాదు.

 Bandi Sanjay Indirectly Commented That Janasena Support Is Not Required  Janasen-TeluguStop.com

మొదటి నుంచి బీజేపీ-జనసేన విషయంలో ఇదే వైఖరితో ఉంటున్న , ఎప్పటికప్పుడు సర్దుకుపోతునే వస్తున్నారు.ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నడుస్తుండటంతో, పవన్ ప్రాధాన్యం బీజేపీ అమాంతం పెంచింది.

పవన్ ను జాగ్రత్తగా చూసుకోమని ప్రధాని మోదీ చెప్పారని , ఆయనే సీఎం అని ఆకాశానికి ఎత్తేశారు.పవన్ ద్వారా ఏపీలో గట్టెక్కడానికి బీజేపీ ఆశ పడతుండగా,  అందుకు విరుద్ధంగా తెలంగాణ బిజెపి నాయకులు వ్యవహరిస్తుండడం జనసేనకు ఆగ్రహం కలిగిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణలో జనసేన పార్టీ తో పొత్తు ఏమీ లేదు అని, అసలు పవన్ అవసరం తమకు ఎందుకు అంటూ తెలంగాణ బిజెపి నాయకులు అంతా వ్యాఖ్యానించడం అప్పట్లో దుమారం రేపింది.ఆ ఎఫెక్ట్ తోని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి కాకుండా,  టిఆర్ఎస్ బలపర్చిన వాణి దేవికి జనసేన మద్దతు పలికి బిజెపి కి షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు చూస్తే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో,  తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని , ఏ పార్టీ అవసరం లేదు అంటూ పరోక్షంగా జనసేన ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ని రేపుతోంది.ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీకి దిగేందుకు ప్రయత్నించగా,  బిజెపి పవన్ ను ఒప్పించి పోటీ నుంచి జనసేన ను దూరం చేసింది.

అంతేకాదు జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని స్టేట్మెంట్లు ఇచ్చారు.

Telugu Bandi Sanjay, Janasena, Pavan Kalyan, Tirupathi, Ysrcp-Telugu Political N

 కానీ అవి తెలంగాణ బిజెపి నాయకులు ఎవరు గుర్తు పెట్టుకోకుండా,  జనసేన ను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శిస్తూ దూరం పెడుతుండటం జనసేన నాయకులకు ఆగ్రహం కలిగిస్తోంది.ఇప్పుడు సంజయ్ మాటలపైన జనసేన తీవ్రంగా మండిపడుతుంది.ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్ రాబోతున్న తరుణంలో, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

అలాగే పవన్ తిరుపతి లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.  అయితే ఇప్పుడు బిజెపి అక్కడ ఓ రకంగా, ఇక్కడ ఒక రకంగా మాట్లాడుతుండటంపైనా, పవన్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube