టీ ప్రభుత్వంపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ ఫిర్యాదు  

Bandi Sanjay Give The Complaint Agaiinst To Telangana Governament-mp Bandi Sanjay,rtc Babu Funeral Yatra,telangana Rtc Strike

ఆర్టీసీ కార్మికుడు బాబు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించిన తనను తెలంగాణ పోలీసులు దారుణంగా అవమానించడంతో పాటు దాడి చేశారని, చేయి చేసుకున్నారు అంటూ కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓంబీర్లాకు ఫిర్యాదు చేశాడు.సంజయ్‌ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్పీకర్‌ ఓం బీర్లా పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌కు ఈ విషయమై విచారణ జరపాలంటూ ఆదేశించారు.

Bandi Sanjay Give The Complaint Agaiinst To Telangana Governament-mp Bandi Sanjay,rtc Babu Funeral Yatra,telangana Rtc Strike-Bandi Sanjay Give The Complaint Agaiinst To Telangana Governament-Mp Rtc Babu Funeral Yatra Rtc Strike

పోలీసులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ఈ సందర్బంగా ఎంపీ సంజయ్‌కు స్పీకర్‌ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.పేపర్‌ కట్టింగ్స్‌తో పాటు కొన్ని వీడియో విజువల్స్‌ను కూడా సంజయ్‌ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సమర్పించడం జరిగింది.

ప్రివిలేజ్‌ కమిటీ ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని సంజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.మరో వైపు ఇప్పటికే సంజయ్‌పై దాడి విషయంలో జాతీయ మానవ హక్కుల సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు మరియు డీజీపీకి నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటీ వివరణ ఇవ్వాలంటూ కోరడం జరిగింది.