వెంకట్రామ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్తిత్వంపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలతో  హాట్ హాట్ గా మారాయి.  ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున రకరకాల సమస్యలపై పోరాటాలు, నిరసనలు చేస్తున్న బీజేపీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.

 Bandi Sanjay Fire On Venkatrama Reddy Mlc Candidature Bjp Party, Bandi Sanjay, T-TeluguStop.com

అయితే తాజాగా ముఖ్యమంత్రి కెసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ జాబితాలో సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామి రెడ్డి పేరు కూడా ఉంది.

అయితే ఎమ్మెల్యే కోటాలో మాజీ కలెక్టర్ వెంకట రామిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులను కలెక్టర్ గా ఉన్న సమయంలో బెదిరించిన వ్యక్తికి ఎలా ఎమ్మెల్సీ పదవిని ఇస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి మీరు పదవులు ఇవ్వడాన్ని చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనేది స్పష్టమవుతుందని అన్నారు.

అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఒక ఐపీఎస్ రాజీనామా చేస్తే ఏ మాత్రం తప్పుగా అనిపించని బీజేపీకి ఒక ఐఏఎస్ రాజకీయాల్లోకి వస్తే మీకు తప్పుగా అనిపిస్తోందా అంటూ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలపై దుమ్మెత్తి పోశారు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @trspartyonline, Mlac Candiadtes, Siddh

అయితే నల్గొండలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, కెసీఆర్ కు భయమేంటో త్వరలో బీజేపీ చూపిస్తుందని బండి సంజయ్ అన్నారు.ప్రజా సమస్యల కోసం పోరాడితే దాడులు చేస్తారా ఎన్ని రోజులు దాడి చేస్తారో మేము చూస్తాం, కెసీఆర్ బెదిరింపులకు బీజేపీ భయపడదంటూ వ్యాఖ్యానించారు.ఏది ఏమైనా  ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామ రెడ్డిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube