నల్గొండలో బండి సంజయ్ కు చేదు అనుభవం... ఏం జరిగిందంటే?

తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ హుజూరాబాద్ లో గెలుపు తర్వాత వరుస పర్యటనలతో దూసుకపోతున్న పరిస్థితి ఉంది.రెండో విడత పాదయాత్రను ప్రారంభించాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో పాదయాత్రను వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది.

 Trs Leaders Attack On Bandi Sanjay In Nalgonda, Bandi Sanjay,trs, Nalgonda, Bjp-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళ్తే నేడు నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటించిన విషయం తెలిసిందే.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులను కలిసే ఆలోచనలో ఉన్న బండి సంజయ్ కు చేదు అనుభవం ఎదురయింది.

కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులు బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.అంతేకాక కోడి గుడ్లతో బండి సంజయ్ పై దాడి చేసిన పరిస్థితి ఉంది.

ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా బండి సంజయ్, బీజేపీ నేతలు అవాక్కయిన పరిస్థితి ఉంది.అయితే ముందస్తుగానే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చింది.

ఇక చివరికి చేసేదేమి లేక బండి సంజయ్ అక్కడి నుండి వెనుదిరిగారు.ఇక ఆ తర్వాత నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కొంత మంది దోతీ, రుమాలు లో వచ్చి రైతులలా టీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని చెప్పినా బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని అందుకే రైతులే తిరగబడ్డారని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా అవాక్కైన బీజేపీ ఇక ఈ ఘటనపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకునే అవకాశం ఉంది.అయితే నేటి దాడి ఘటన నేపథ్యంలో రేపు కెసీఆర్ అధ్యక్షతన శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

కేంద్రం అవలంబిస్తున్న  వైఖరికి నిరసనగా తదుపరి చేపట్టబోయే కార్యాచరణను శాసన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube