హిమాచల్‌కు బయలుదేరిన దత్తన్న  

Bandaru Dattatreya Has Governer In Himachal Pradesh-bjp,central Minister,narendra Modi

తెలంగాణ బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయకు పార్టీ జాతీయ నాయకత్వం ప్రమోషన్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దత్తాత్రేయను హిమాచల్‌ ప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించడం జరిగింది.గతంలో కేంద్ర మంత్రిగా మరియు ఎంపీగా ఇంకా పలు కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఉన్న దత్తన్న మోడీ మొదటి సారి ప్రధాని అయిన సమయంలో కేంద్ర మంత్రిగా చేసిన విషయం తెల్సిందే...

Bandaru Dattatreya Has Governer In Himachal Pradesh-bjp,central Minister,narendra Modi-Bandaru Dattatreya Has Governer In Himachal Pradesh-Bjp Central Minister Narendra Modi

ఆ సమయంలో కొన్ని రాజకీయ సమీరణ కారణంగా మంత్రి వర్గం నుండి తప్పుకోవాల్సి వచ్చింది.అప్పటి నుండి అవకాశం ఎదురు చూస్తున్న దత్తన్నకు ఇప్పటికి ఛాన్స్‌ దక్కింది.

బీజేపీకి చెందిన పలువురు సీనియర్‌లకు గవర్నగ్‌గా అవకాశం దక్కింది.

Bandaru Dattatreya Has Governer In Himachal Pradesh-bjp,central Minister,narendra Modi-Bandaru Dattatreya Has Governer In Himachal Pradesh-Bjp Central Minister Narendra Modi

ఈ నేపథ్యంలోనే బండారు దత్తాత్రేయకు కూడా గవర్నర్‌గా కేంద్రం ఛాన్స్‌ ఇచ్చింది.నేడు కేంద్రం నుండి అధికారులు హైదరాబాద్‌ చేరుకుని దత్తాత్రేయకు హిమాచల్‌ ప్రదేశ్‌కు గవర్నర్‌గా ఎన్నిక అయిన పత్రాలను అందించడం జరిగింది.దాంతో రేపు ఉదయం హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లి 10 గంటల 30 నిమిషాలకు గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దత్తన్న కుటుంబ సభ్యులు మరియు బీజేపీ ముఖ్య నాయకులు అంతా కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనబోతున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తానంటూ దత్తన్న నేడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చాడు.