తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ( ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించారు తెలంగాణ సీఎం కే.సి.

 Banda Srinivas Appointed As Chairman For Telangana Sc Corporation, Sc Corporatio-TeluguStop.com

ఆర్. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.కరీం నగర్ జిల్లా హుజురాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ విధ్యార్ధి దశ నుంది సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.

ఆ పార్టీ విద్యార్ధి విభాగంలో పలు హోదాల్లో పనిచేశారు బండా శ్రీనివాస్.

స్వతహాగా హాకీ ప్లేయర్ అయిన శ్రీనివాస్ హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.ఇదే కాకుండా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ గ.జిల్లా టెలికాం బోర్డ్ మెంబర్ గా కూడ బండా శ్రీనివాస్ పనిచేశారు.హుజురాబాద్ నుండి ఎంపీటీసీగా రెండు సార్లు గెలిచారు.

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.అయితే బండా శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకోవడం హుజూరాబాద్ ఉప ఎన్నికలలో భాగమే అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికలను టీ.ఆర్.ఎస్ చాలా ప్రెస్టిజియస్ గా తీసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube