విద్యార్థుల తుంటరి తనం తో టీచర్ ప్రాణం మీదకు వచ్చింది!

విద్యార్థులు అంటేనే తుంటరిగా,అల్లరి చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఆ అల్లరి హద్దు దాటితే అనర్ధాలు చోటుచేసుకుంటాయి అన్న విషయం ఈ తాజాగా ఉదంతం తో వెల్లడైంది.అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.కె-8 స్కూల్‌లో పనిచేస్తున్న ఓ టీచర్‌కు ‘ఫ్రూట్స్ అలర్జీ’ ఉంది.అయితే అందుకే ఆమె తరగతి గది తలుపుకు ‘బనానా ఫ్రీ జోన్’ బోర్డు కూడా పెట్టారు.అయితే తరగతిలో విద్యార్థులు తుంటరి తనంతో తరగతి గాడి డోర్ హ్యాండిల్స్ కు అరటి పండు గుజ్జును పూసి,తొక్క వలచిన అరటి పండ్లను ఆమెపైకి విసిరారు.

 Bananaprankleftus Teacherfighting Forherlife 1-TeluguStop.com

అరటి పండ్లు తగలగానే ‘అనాఫిలాక్టిక్ షాక్‌’కు గురైన టీచర్ 15 నిమిషాల తర్వాత ఆమె శరీరం రంగు మారిపోయింది.దీంతో ఆమెకు వెంటనే ఎపీపెన్ (epipen – తీవ్రమైన అలర్జీకి ఇచ్చే ఔషదం) ఇచ్చారు.

అప్పటికీ ఆమె తేరుకోలేకపోవడం తో చివరికి ఫలితం లేక ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె ఐసీయూలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నట్లు తెలుస్తుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఏదైనా పిల్లల తుంటరి తనం తో ఆ టీచర్ ప్రాణాల మీదకు తెచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube