అరటి తొక్కే కదా అని తీసేస్తున్నారా..? దాంతో ఎన్ని లాభాలంటే..?

Banana Peel Skin Hair Benefits

అరటి పండు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే అన్ని సీజన్లలో విరివిగా లభించే పండు అరటి పండు.

 Banana Peel Skin Hair Benefits-TeluguStop.com

అలాగే సామాన్యుడి దగ్గర నుండి ధనికుల వరకు అందుబాటు ధరలోనే లభిస్తుంది.అరటికాయను రోజూ తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు.

అందుకే ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వలన జబ్బుల బారిన పడకుండా ఉంటాము.మాములుగా మనం అరటికాయ తినడానికి దాని మీద ఉన్నా తొక్క తీసేసి తింటాము కదా.

 Banana Peel Skin Hair Benefits-అరటి తొక్కే కదా అని తీసేస్తున్నారా.. దాంతో ఎన్ని లాభాలంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అరటి పండు తిన్న తర్వాత తొక్కను డస్ట్ బిన్ లో పారవేస్తాము.అయితే ఇక్కడే మీకు తెలియని విషయం ఒకటి ఉంది.

అది ఏంటంటే.తొక్కే కదా అని అరటి పండు తొక్కను పారేయకండి.

అరటి తొక్కల్లో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా.అరటి తొక్కల్లో ఉండే పోషకాలు మన చర్మ వ్యాధులను, జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.

అంటే అందాన్ని రెట్టింపు చేయడంలో అరటి తొక్క ఉపయోగపడుతుందన్నమాట.అరటి తొక్కలతో కలిగే ఉపయోగాలపై ఓలుక్కేద్దాం.

చర్మంపై మచ్చలు పోవాలంటే అరటి తొక్క మంచిగా ఉపయోగపడుతుంది.అరటి తొక్కలతో ఫేస్ మాస్క్‌ చేసుకుంటే మచ్చలు పోతాయి.వీటిలోని కార్బోహైడ్రేట్లు, విటమిన్ B6, B12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు మీ కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి.చర్మం ఉపరితలాన్ని సున్నితంగా చేస్తాయి.

అందువల్ల, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, ఉన్న ప్రాంతాల్లో అరటి తొక్కలను ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా వాటిని సులభంగా తొలగించవచ్చు.

యవ్వనత్వంతో కూడిన చర్మం అరటి తొక్కల్లో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.చర్మాన్ని ఎల్లప్పుడూ తాజాగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.పండిన అరటి తొక్కలో ఇథిలీన్ ఉంటుంది.

దీనితో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మం కాతంతివంతంగా తయారవుతుంది.ఒక ఫోర్క్ ఉపయోగించి అరటి తొక్క లోపలి భాగాన్ని తీయండి.

దాన్ని గుడ్డు పచ్చసొనలో కలపండి.ఆ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసుకొని 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలంటే అరటి తొక్కను సన్నని పొరలుగా కట్ చేసి వాటిని మీ కళ్ళ కింద ఉంచడం వల్ల డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి.

అరటి తొక్క జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీ జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.సహజంగా తలపై ఏర్పడే ఫంగస్ ద్వారా చుండ్రు సమస్య వస్తుంది.

అరటి తొక్కలతో హెయిర్ మాస్క్‌గా ఉపయోగిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.ఉత్తమ ఫలితం కోసం సుమారు 2-3 అరటిపండ్లు తొక్క నుండి లోపలి పొరను తీసుకోండి.2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలతో పేస్ట్ వరకు దాన్ని కలపండి.ఆ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రోజ్ వాటర్ ను కలపండి.

దీంతో పాటు1 స్పూన్ పెరుగును కూడా కలపండి.ఈ మిశ్రమాన్ని మీ చర్మం, జుట్టు మీద పట్టించండి.15–20 నిమిషాల తర్వాత దాన్ని తొలగించి శుభ్రం చేసుకోండి.తద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది.

చూసారు కదా అరటి తొక్క వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.

#Banana Peel #Face #Dandruff #Dark Circles #Banana

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube