మనదేశంలో సాంప్రదాయాలకు పెట్టింది పేరు.ఎలాంటి శుభకార్యాలు జరిగినా, మన ఇంట్లో పండుగలు జరిగిన భోజనాలు ఆకులలో చేయడానికి చాలామంది ఇష్టపడతారు.
విస్తరాకులు కానీ, అరటి ఆకులలో కానీ భోజనాలు వడ్డించడం మన సాంప్రదాయం కూడా.ఆకులలో భోజనం వడ్డించడం మన పూర్వం నుంచి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.
కానీ ప్రస్తుతం ఎటువంటి శుభకార్యం జరిగినా ప్లాస్టిక్ ఆకులలో భోజనం పెట్టడం ఆనవాయితీగా మారింది.దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అయితే అరటి, మర్రి, మోదుగ వంటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
మన సాంప్రదాయాలు అరటి, రావి వృక్షాలను సాక్షాత్తు ఆ దైవం గా భావించి, పూజలు చేస్తూ ఉంటారు.
మరి అలాంటి ఆకులలో భోజనం చేయడం శుభ ఫలితాలు జరుగుతాయి.అంతేకాకుండా అరటి ఆకు, మర్రి, మోదుగ వంటి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
వీటిలో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఔషధ గుణాలను పరోక్షంగా మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా, ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మనం తినే వేడి ఆహార పదార్థాలను ఈ ఆకులలో పెట్టుకోవడం వల్ల ఆ వేడికి అందులోన ఔషధగుణాలన్ని మనం తినే ఆహార పదార్థాలలో కలుసుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అరటి ఆకులో భోజనం చేయడం వల్ల మన పై ఎవరైనా విషప్రభావం ప్రయోగం చేస్తే అరటి ఆకు మనల్ని రక్షిస్తుంది.అలాంటి ఆహారం మనకు ఎవరైనా పెడితే అది నీలి రంగులోకి మారుతుంది.
అంతేకాకుండా ఆకులలో క్లోరోఫిల్ వంటి వర్ణద్రవ్యం ఉండటంవల్ల మన శరీరానికి కావల్సినంత పిండి పదార్థాలను చేకూరుస్తుంది.అందువల్ల పూర్వకాలంలో ఎవరైనా అతిథులు వస్తే వారికి అరిటాకులు లోనే భోజనం వడ్డించేవారు.
ఇప్పటికి కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మర్రి ఆకులను సేకరించి వాటిని విస్తర్ల గా కుట్టి, ప్రత్యేకమైన రోజులలో ఆ ఆకుల లోనే భోజనాలు చేస్తూ ఉంటారు.ఇప్పటికీ కూడా దేవాలయాలలో మర్రి ఆకుల లో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.
మోదుగ ఆకులలో భోజనం వల్ల కళ్ళకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి.మర్రి ఆకులలో భోజనం వల్ల జననేంద్రియ సమస్యలు తొలగిపోతాయి.
ఇలాంటి ఆకులలో భోజనం చేయడం అవి తొందరగా కుళ్ళి పోయి మంచి కంపోస్టు తయారు అవ్వడమే కాకుండా, ఎటువంటి కాలుష్యాన్ని కలిగించవు.