స్టేషన్ లో అరటి పండ్ల అమ్మకాన్ని బ్యాన్ చేసిన రైల్వే అధికారులు!  

Banana Ban In Lucknow Railway Station-childrens Eat In Banana

పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడే పండు అరటిపండు.ఈ పండు కి ఎంత శక్తి వస్తుంది అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కావలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పండు నే తింటూ ఉంటారు.చివరికి క్రీడాకారులు కూడా అరటిపండుకు చాలా ప్రాముఖ్యత నిస్తారు.చివరికి ప్రయాణాల సమయంలో పిల్లలు ఏమైనా అన్నం తినకపోయినా కూడా స్టేషన్ లో దొరికే అరటి పండ్ల తో పిల్లల కడుపు నింపుతూ ఉంటారు తల్లిదండ్రులు.

Banana Ban In Lucknow Railway Station-childrens Eat In Banana-Banana Ban In Lucknow Railway Station-Childrens Eat

అయితే అలాంటి అరటి పండ్లను అమ్మకూడదు అంటూ రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేసింది.ఇంతకీ ఎక్కడ అది అని ఆలోచిస్తున్నారా.మరెక్కడో కాదు ఇండియా లోనే, ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లోని చార్ భాగ్ స్టేషన్ లో ఈ అరటి పండ్ల ను అమ్మకూడదు అంటూ అక్కడి రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Banana Ban In Lucknow Railway Station-childrens Eat In Banana-Banana Ban In Lucknow Railway Station-Childrens Eat

అరటి పండ్లు తినేసి ఎక్కడ పడితే అక్కడ వాటి తొక్కలు పడేసి స్టేషన్ మొత్తం చెత్తగా చేస్తున్నారు అని ఆ స్టేషన్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఒకవేళ నిబంధలను ఉల్లంఘిస్తే మాత్రం జైలు శిక్ష కూడా విధిస్తామంటూ వారు హెచ్చరిస్తున్నారు.

అంటే ఇక ఆ స్టేషన్ లో అరటి పండు తినాలి అంటే బయటకు వెళ్లి తినాల్సిందే.