నిర్మాతల కోసమే మీడియా బ్యాన్‌?  

పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డితో వర్మ చేయించిన వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్‌ పదే పదే ప్రసారం చేయడం జరిగింది. దాంతో పవన్‌ కళ్యాణ్‌ ఆ ఛానెల్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. దాంతో పాటు ఫిల్మ్‌ ఛాంబర్‌లో మీడియాలో తనపై జరుగుతున్న దాడికి సినిమా పెద్దలు ప్రశ్నించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపిన విషయం తెల్సిందే...

నిర్మాతల కోసమే మీడియా బ్యాన్‌?-

ఈ నేపథ్యంలోనే న్యూస్‌ ఛానెల్స్‌ను సినిమా పరిశ్రమ బ్యాన్‌ చేయాలి అంటూ ప్రతిపాధనను మెగా క్యాంప్‌ తీసుకు వచ్చింది. సినిమా పరిశ్రమ పెద్దలు కొందరు భేటీ అయిన సమయంలో అల్లు అరవింద్‌ ఈ విషయాన్ని ప్రస్థావించడం జరిగిందని, అందుకు ఎక్కువ శాతం మంది నో చెప్పినట్లుగా తెలుస్తోంది.సినీ ప్రముఖుల భేటీలో న్యూస్‌ ఛానెల్స్‌పై బ్యాన్‌ కుదరని కారణంగా హీరోల భేటీ నిర్వహించి అందులో బ్యాన్‌ విషయాన్ని చర్చించారని తెలుస్తోంది.

అయితే ఆ భేటీలో నిర్మాతల శ్రేయస్సు కోసం, పబ్లిసిటీ ఖర్చులు తగ్గించుకోవడం కోసం సినిమాల ప్రమోషన్‌ను న్యూస్‌ ఛానెల్స్‌లో చేయకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌లో మాత్రమే సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తెలుగులో కూడా అదే విధానాన్ని తీసుకు రావడం వల్ల నిర్మాతలకు భారీగా ఖర్చు ఆదా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ప్రముఖ న్యూస్‌ ఛానెల్స్‌లో సినిమా యాడ్స్‌ను ప్రసారం చేసేందుకు లక్షలు ఖర్చు అవుతున్నాయి. కొన్ని ఛానెల్స్‌కు యాడ్స్‌ ఇవ్వకుంటే కక్ష సాధించేలా కథనాలు రాస్తున్నారు. కనుక సినిమా పరిశ్రమ మొత్తం కలిసి న్యూస్‌ ఛానెల్స్‌ను పక్కన పెట్టాలని, సినిమా కార్యక్రమాలు, ఆడియో వేడుకలు ఇలా అన్ని కూడా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌కు మాత్రమే ఇవ్వాలనే నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా లాభం పొందేది నిర్మాతలు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.ఈమద్య కాలంలో నిర్మాణాత్మక వ్యయం భారీగా పెరిగింది. నిర్మాతలు చిన్న చిత్రాలు తీయాలన్నా కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఇక పెద్ద సినిమాల ఖర్చు ఆకాశంలోనే ఉంటుంది. ఇలాంటి సమయంలో యాడ్స్‌ కోసం కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చును తగ్గించడం కోసమే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

మరి ఈ విషయంలో సినిమా పరిశ్రమ తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.