కన్నడ టీవీ నటుడుపై నిషేధం.. ఇక తెలుగు సీరియల్స్‌లో నటించే అవకాశమే లేదుగా!

కన్నడ నటుడు చందన్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన్ ప్రస్తుతం శ్రీమతి శ్రీనివాస్ సీరియల్లో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.

 Kannada Actor, Chandan Kumar , Telugu Telivijan, Controversy, Ban, Srimathi Srini Vas-TeluguStop.com

అయితే తాజాగా చందన్ ని బ్యాన్ చేస్తున్నట్టు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ హైదరాబాద్ లో మీడియా ముందు వెల్లడించారు.పూర్తి వివరాల్లోకి వెళితే.

చందన్ కుమార్ ఈ ఆదివారం శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ షూటింగ్ లో భాగంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిడుతూ అతని కొట్టి నాన్న రచ్చ చేశాడట.దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, అంతేకాకుండా తన తల్లిని దూషించాడని అతనితో వాదనకు దిగాడట.

 Kannada Actor, Chandan Kumar , Telugu Telivijan, Controversy, Ban, Srimathi Srini Vas-కన్నడ టీవీ నటుడుపై నిషేధం.. ఇక తెలుగు సీరియల్స్‌లో నటించే అవకాశమే లేదుగా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే కొందరు అక్కడ పనిచేస్తున్న వారు హీరో పై సీరియస్ అయ్యారట.

అయితే నటుడు చందన్ కుమార్ తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగా నేనేంటో చూపిస్తాను అంటూ వారిపై సీరియస్ అయ్యాడట.

దీంతో చందన్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ ని అందరి ముందే కొట్టాడట.ఇదే విషయంపై మీడియాకు వివరణ ఇచ్చిన కుమార్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఆమెకు హాస్పటల్లో చికిత్స అందిస్తున్నాము.నిద్ర లేక బాగా అలసిపోయిన నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తానని అదే విషయాన్ని డైరెక్టర్ తో చెప్పమని చెప్పాను.

నేను చెప్పింది ఎలా మిస్ కమ్యూనికేట్ అయిందో తెలియదు తర్వాత టీం నాపై దానికి దిగారు.అయితే ఇవేమీ నేను మనసులో పెట్టుకోను.

ఇది వరకు మాదిరిగానే నేను పని చేసుకుంటూ పోవడానికి ప్రయత్నిస్తాను అని చందన్ కుమార్ చెప్పుకొచ్చారు.అయితే ఇదంతా కూడా శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ షూటింగ్ సమయంలో గొడవ జరిగిందట.

అప్పుడు చుట్టూ ఉన్నవారు చందన్ కుమార్ ని షూటింగ్ నుంచి వెళ్లకుండా ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా చందన్ షూటింగ్ నుంచి వెళ్లిపోయారట.అయితే గొడవ అక్కడితో ముగిసింది అని అనుకుంటే చందన్ కుమార్ మళ్ళీ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమ గురించి రకరకాలుగా మాట్లాడాడట.తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడడంతో వివాదం కాస్త మరింత ముదిరింది.ఇదే విషయంపై తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసి చందన్ కుమార్ ను బ్యాన్ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ విషయం పై డైరెక్టర్ మాట్లాడుతూ.చందన్ కుమార్ ని షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను.

కానీ అతను రాకుండా నన్ను కొట్టి బూతులు తిట్టాడు.డైరెక్టర్ సార్ కి కంప్లైంట్ చేస్తే బయటికి రా దమ్ముంటే నేనేంటో చూపిస్తాను అని బెదిరించాడు అని చెప్పుకొచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్.

ఇదే విషయంపై తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసి చందన్ కుమార్ ను బ్యాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.అంతేకాకుండా చందన్ కుమార్ మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా అతను ప్రవర్తించాడని, దాడి చేయడమే కాకుండా టీవీ పరిశ్రమకు చెడ్డ పేరు తెచ్చే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని,ఇకపై తెలుగు సీరియల్స్ లో అతన్ని తీసుకోమని, ఇదే విషయం పట్ల అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాము అని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube