ఇండియా భయపడలేదు.. చైనీస్ యాప్‌ల నిషేధాన్ని సమర్ధించిన నిక్కీ హేలీ

గాల్వన్ లోయలో 20 మంది సైనికుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న చైనాపై ప్రతీకార చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించింది.మన ప్రభుత్వం ఈ తరహా ఆలోచన చేస్తుందని ఊహించలేకపోయిన బీజింగ్.

 Ban On Chinese Apps After Mike Pompeo Ex Us Envoy To Un Nikki Haley Lauds India,-TeluguStop.com

భారత్‌పై రగిలిపోతోంది.సరిహద్దుల్లో చైనా దూకుడుపై పలు దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ సైతం మనదేశానికి మద్ధతు ప్రకటించారు.భారత్‌ను అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పరిగణించే టిక్‌టాక్ సహా చైనా సంస్థలకు చెందిన 59 యాప్‌లను నిషేధించడాన్ని నిక్కీ ప్రశంసించారు.

చైనా దూకుడుకు భారత్ భయపడలేదని ఆమె తెలిపారు.

మరోవైపు యాప్‌ల నిషేధాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా సమర్థించారు.

చైనా యాప్‌లను ఇండియా నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని, ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు.కాగా, గాల్వన్‌లో చైనా ఘర్షణకు పాల్పడినట్లు మరో సెనేటర్ మిచ్ మెక్‌కానెల్ వారంలోనే రెండోసారి ఆరోపించారు.

భారత్‌పై చైనా దూకుడుగా వ్యవహరించిందని మండిపడ్డారు.

Telugu Banchinese, China, Chinese Apps, Envoy, India, Tik Tok-Telugu NRI

అంతకుముందు, సెనేటర్ టామ్ కాటన్ చైనా హింసాత్మక వైఖరిని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. జపాన్ భూభాగాల్లోకి జలాంతర్గామి చొరబాట్లు చేయడం ద్వారా భారతదేశంతో హింసాత్మక ఘర్షణలను చైనా తిరిగి ప్రారంభించిందని అర్కాన్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీకే చెందిన మరో సెనేటర్ టామ్ కాటన్ అన్నారు.దేశ ప్రజలకు, దేశ భద్రతకు భంగం కలిగించే కార్యక్రమాల్లో చైనాకు సంబంధించిన యాప్స్‌ భాగం అవుతున్నాయన్న సమాచారంతో 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.

ఈ యాప్స్‌ వినియోగదారుల డేటాను దొంగిలించి దేశం బయటకు తరలిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube