హార్దిక్ పాండ్యా గురించి ఒక్క మాటలో చెప్పిన బుమ్రా.. ఏం చెప్పాడంటే..?!  

Bumrah sensational comments on Hardik Pandya , Hardik Pandey, IPL, Indian cricketer, Indian team, Australia tour, bhumra, Jahir Khan, Jayavardane, - Telugu Australia Tour, Bhumra, Hardik Pandey, Indian Cricketer, Indian Team, Ipl

ప్రస్తుతం టీమిండియా ఐపీఎల్ ను పూర్తి చేసుకుని అట్నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆస్ట్రేలియాకు వెళ్లారు టీం సభ్యులు.ఇకపోతే ఎవరైనా సరే తన సహచర క్రికెటర్ గురించి ఎవరైనా మాట్లాడండి అని అడిగితే.

TeluguStop.com - Bamra Said In One Word About Hardik Pandya What To Say

ఎవరైనా సరే అతను ఓ గొప్ప ఆటగాడని, మంచి వ్యక్తిత్వం కలవాడు అని చెబుతూ ఉంటారు.లేకపోతే వారిలో ఉన్న కొన్ని మైనస్ పాయింట్లు చెబుతూ అవి మార్చుకోవాలని కొందరు సూచిస్తుంటారు.

అయితే తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.ఆల్ రౌండర్ అయినా హార్దిక్ పాండే గురించి మాట్లాడితే ఠక్కున గుర్తొచ్చేది అతడి పవర్ఫుల్ హిట్టింగ్ మాత్రమే.

TeluguStop.com - హార్దిక్ పాండ్యా గురించి ఒక్క మాటలో చెప్పిన బుమ్రా.. ఏం చెప్పాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

చూడటానికి సన్నగా ఉన్నా కానీ బంతిని కొడితే మాత్రం బౌండరీ అవతల బాల్ పడేలా కొడతాడు.ఈమధ్య తండ్రి కూడా అయ్యాడు హార్దిక్ పాండ్యా.

అతడు క్రీజ్ లో ఉన్నంత సేపు సిక్సర్ల వర్షం కురిపిస్తూనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడు.

ఇకపోతే తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా గురించి ఓ వీడియోను పోస్ట్ చేసి అందులో ఆయన గురించి ఒక్క మాటలో అభిమానించండి అంటూ పోస్ట్ చేసింది.

ఇందుకు సంబంధించి అనేక మంది క్రికెట్ దిగ్గజాలు హార్థిక్ పాండ్య గురించి కామెంట్స్ చేస్తున్నారు.ఇంకా ఎవరైనా సరే హార్దిక్ పాండ్య గురించి తెలిసినవారు అయితే అతడు ఓ మంచి బ్యాట్స్మెన్ లేకపోతే మంచి ఆల్రౌండర్ అని చెబుతూ ఉంటారు.

అంతేకాదు కొంతమంది మంచి మ్యాచ్ ఫినిష్ అని కూడా ఆయనకు కితాబు ఇస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా ముంబాయి ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ కోచ్ అయిన జయవర్ధనే సమాధానం ఇస్తూ.

హార్దిక్ పాండ్యా అంటే ఓ వ్యక్తిత్వం అని సమాధానం ఇచ్చాడు.

వీరితో పాటు ముంబై ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ జహీర్ ఖాన్ స్పందిస్తూ హార్దిక్ పాండ్యా అంటే పవర్ స్ట్రెంత్ అంటూ సమాధానం ఇచ్చాడు.అలాగే హార్దిక్ పాండ్యా గురించి ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అయితే హార్దిక్ పాండ్య ఏకంగా ఓ లెజెండ్ అంటూ కితాబు ఇచ్చాడు.ఇకపోతే వీరంతా మామూలుగా కామెంట్ చేస్తే టీమిండియా నెంబర్వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాస్త వెరైటీగా సమాధానం ఇచ్చాడు.

బూమ్రా.హార్థిక్ పాండ్య ఆట గురించి మాట్లాడకుండా అతడు ఒక గొప్ప అందగాడు అంటూ వెరైటీగా సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అంతేకాదు తాను హార్థిక్ పాండ్యా ని అందగాడిగా అభివర్ణించిన విషయాన్ని కూడా అతనికి తెలియ చేయండి అంటూ అందులో సూచించాడు.మరి ఈ విషయంపై హార్దిక్ పాండ్యా ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే మరి.

#Bhumra #Hardik Pandey #Indian Team #Australia Tour

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bamra Said In One Word About Hardik Pandya What To Say Related Telugu News,Photos/Pics,Images..