బామ్మా మజాకా.. 105 ఏళ్ల వయసులోనే కరోనా తో పోరాడి.. సీక్రెట్ తెలిస్తే షాక్ !

పది పదుల వయసులో కరోనాను జయించింది 105 ఏళ్ల బామ్మ.కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.దీంతో బామ్మ కూడా పరీక్షలు నిర్వహించుకుంది.కాగా ఆమెకు రిపోర్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అప్పటి నుంచి ఆరోగ్య అలవాట్ల కారణంగానే వైరస్ ను జయించానని బామ్మ పేర్కొన్నారు.

 Karnool, Old Women, Corona-TeluguStop.com

నగరంలోని పాతబస్తీ పెద్దపడఖానా వీధికి చెందిన బి.

మోహనమ్మకు 105 ఏళ్లు. బంగారం నగల తయారీ కుటుంబం.

భర్త మరణించారు.నగరంలో కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కర్నూల్ కి వెళ్లిపోయారు.

వీరి సంతానం ఎనిమిది మంది.ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.

గ్రామంలో వాలంటీర్లు 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా చికిత్సలు చేస్తున్నారు.మోహనమ్మకు పరీక్షలు నిర్వహించడంతో గత నెల 19 వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో ఆమెను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమెకు జ్వరం తప్ప వేరే సమస్యలు తలెత్తలేదు.కరోనా వచ్చినా ధైర్యంతో ఎదుర్కొన్నారు.ప్రతి రోజు యోగా, ధ్యానం, వాకింగ్, పౌష్టికాహారం తీసుకున్నారు.

తల్లితో పాటే కొడుకు దగ్గరుండి చూసుకున్నాడు.కరోనాతో క్యూర్ అయి గతనెల 31 న డిశ్చార్జ్ అయ్యారు.

వయసు పైబడిన వాళ్లు కూడా కరోనాను జయించవచ్చని పలువురికి ఆమె ధైర్యం చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube