ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి డెలివరీ బాయ్స్ గా మారుతున్నారు.డెలివరీ బాయ్స్( Delivery Boys ) కు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే జొమాటో డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సాధించి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్ రావు( Balwant Rao ) కొన్ని రోజుల గ్యాప్ లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల జొమాటో డెలివరీ బాయ్( Zomato Delivery Boy ) గా మారిన ఈ యువకుడు కోచింగ్ కు కూడా టైమ్ లేక సొంతంగా ప్రిపేర్ అయ్యాడు.ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగలాకు బల్వంత్ రావు ఎంపికయ్యారు.
ఒకవైపు డెలివరీ బాయ్ గా పని చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన బల్వంత్ రావు సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న బల్వంత్ రావు తన సక్సెస్( Success Story ) తో ప్రశంసలు అందుకుంటున్నారు.గ్రామస్తులు, తల్లీదండ్రులు బల్వంత్ రావు సక్సెస్ ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.బల్వంత్ రావు నేటి తరానికి చెందిన ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నాడని కష్టపడితే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందని ప్రూవ్ చేశాడని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కొన్నిరోజుల గ్యాప్ లో మూడు ఉద్యోగ ఖాళీలకు ఎంపిక కావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.బల్వంత్ రావు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షించడంతో పాటు వీడియో రూపంలో తన సక్సెస్ స్టోరీని పంచుకోవాలని కోరుతున్నారు.
బల్వంత్ రావు సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.తమ కొడుకు సక్సెస్ ను చూసి బల్వంత్ రావు తల్లీదండ్రులు ఎంతగానో గర్వపడుతున్నారు.