బాలు సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే అవాక్కవుతారు...

తెలుగులో ప్రముఖ దర్శకుడు “ఏ కరుణాకరన్” దర్శకత్వం వహించిన “బాలు” చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” నటించగా హీరోయిన్లుగా ఎవర్ గ్రీన్ బ్యూటీ “శ్రీయ శరన్” అలాగే బాలీవుడ్ బ్యూటీ “నేహా ఒబెరాయ్” లు నటించారు.

 Balu Movie Fame Neha Oberoi Real Life And Movie Career News-TeluguStop.com

అలాగే ఈ చిత్రంలో “గుల్షన్ గ్రోవర్, సుమన్, తనికెళ్ళ భరణి, జయసుధ, సునీల్” తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో కనిపించే హీరోయిన్ నేహా ఒబెరాయ్ గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

అయితే నేహా ఒబెరాయ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా పరిశ్రమకి వచ్చింది.కాగా అప్పటికే నేహా ఒబెరాయ్ తండ్రి “ధరమ్ ఒబెరాయ్” బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాత గా బాగానే రాణిస్తున్నాడు.

 Balu Movie Fame Neha Oberoi Real Life And Movie Career News-బాలు సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే అవాక్కవుతారు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో నేహా ఒబెరాయ్ కి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉండటంతో బాలు చిత్ర ఆడిషన్స్ లో హీరోయిన్ పాత్ర కోసం పాల్గొంది.

అయితే ఈ చిత్రంలో ఈ అమ్మడు నట్టించిన సన్నివేశాల నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.

దాంతో జగపతిబాబు హీరోగా నటించిన “బ్రహ్మాస్త్రం” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఏమైందో ఏమో గానీ ఈ చిత్రంలో నటించిన తర్వాత “నేహా ఒబెరాయ్” మళ్లీ తెలుగులో హీరోయిన్ గా నటించలేదు.

కానీ ఏడాదికి ఒక సినిమా చొప్పున మూడు సినిమాలలో నటించి బాలీవుడ్ లో అప్పుడప్పుడు ప్రేక్షకులను అలరించింది.

అయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.దీంతో ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక ఎక్కువ ఇంటిపట్టునే ఖాళీగా గడిపింది.

ఈ క్రమంలో తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.

ఇందులో భాగంగా 2010 వ సంవత్సరంలో “విశాల్ షా” అనే ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన భర్తకి వ్యాపార పనుల్లో సహాయం చేస్తుంది.అయితే ఏదేమైనప్పటికీ సినిమా పరిశ్రమలో రాణించాలంటే కుటుంబ బ్యాగ్రౌండ్, డబ్బు, హోదాలు, వంటివి పని చేయని కేవలం నటన ప్రతిభ మాత్రమే మనల్ని నిలబెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#BaluMovie #Neha Oberoi #Pawan Kalyan #NehaOberoi #NehaOberoi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు