నందమూరి ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ, కాని చిన్న లోటు..!   Balkrishna With Ntr At Aravinda Sametha Success Meet     2018-10-22   13:29:44  IST  Sainath G

నందమూరి ఫ్యాన్స్‌ చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సందర్బం రానే వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత ఒకే వేదికపై బాబాయి నందమూరి బాలకృష్ణ, అబ్బాయి జూనియర్‌ ఎన్టీఆర్‌ లు కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చిందనే సంతోషంలో వారు మునిగి పోయారు. అరవింద సమేత చిత్రం సక్సెస్‌ వేడుకలో ముఖ్య అతిథిగా బాలకృష్ణ గారు రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యుల కంటే అధికంగా నందమూరి అభిమానులు మరియు ప్రేక్షకులు ఆనందించారు. ఎన్టీఆర్‌, బాలకృష్ణలను ఒకే వేదికపై చూడాలని కోరుకున్న వారికి ఇది నిజంగా కన్నుల పండుగే.

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ చిత్రంతో చాలా బిజీగా ఉన్నా కూడా బాలకృష్ణ ఈ వేడుకలో హాజరు అయ్యి చిత్ర యూనిట్‌ సభ్యులను అభినందించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ సభ్యులపై అభినందనలు కురిపించాడు. ఈ సమయంలోనే అబ్బాయిలు కళ్యాణ్‌ రామ్‌ మరియు ఎన్టీఆర్‌లతో ఫొటోలకు ఫోజ్‌లు ఇవ్వడం జరిగింది. అంతా బాగానే జరిగినా కూడా బాలకృష్ణ నోటి నుండి ఎక్కువగా ఎన్టీఆర్‌ గురించి రాలేదు. దాంతో ఫ్యాన్స్‌ ఆ విషయంలో కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.

Balkrishna With Ntr At Aravinda Sametha Success Meet-

బాలకృష్ణ పావుగంటకు ఎక్కువగానే మాట్లాడాడు. కాని ఎన్టీఆర్‌ గురించి రెండు మూడు ముక్కలు ప్రత్యేకంగా మాట్లాడలేదు. మేము చేసే సినిమాలు చాలా బాగుంటాయి, విభిన్నంగా ఉంటాయి అంటూ చెప్పిన బాలకృష్ణ ఎక్కడ కూడా ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించినట్లుగా అనిపించలేదు. ఎన్టీఆర్‌ పై ఏమూలనో బాలయ్యకు కోపం ఉందా ఇంకా అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతున్నాయి.

మరికొందరు ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పుడే కదా కలిసింది, ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాల్లో వీళ్లు కనిపిస్తారు కనుక తప్పకుండా, ఆ సమయంలో బాలయ్య నోటి నుండి ఎన్టీఆర్‌ గురించి వస్తుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.