ఆస్తి రాసిస్తావా, విడాకులిస్తావా... భార్య, అత్తమామల వేధింపులు: కెనడాలో భారతీయుడు ఆత్మహత్య

కెనడాలో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వాంకోవర్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల బల్జీందర్ సింగ్‌ సోమవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 Baljinder Singh Indian National Commits Suicide In Canada-TeluguStop.com

పంజాబ్‌లోని మొగకు సమీపంలోని ధల్లే గ్రామానికి చెందిన బాధితుడి మరణానికి అత్త మామల వేధింపులు, భార్యతో మనస్పర్ధలే కారణంగా తెలుస్తోంది.

దీనిపై బల్జీందర్ సింగ్ తండ్రి నారాయణ్ సింగ్ సింధు మాట్లాడుతూ.

తన కుమారుడికి 2017లో మొగకు చెందిన ఎన్నారై మహిళతో వివాహమైందని, రెండు నెలల పాటు ఆమె తమ ఇంట్లోనే ఉందని చెప్పారు.అనంతరం ఆమె కెనడాకు వెళ్లిపోయిందని.

కోడలికి పాప జన్మించడంతో బల్జీందర్ 2018 నవంబర్‌లో కెనడాకు వెళ్లినట్లు నారాయణ్ సింగ్ తెలిపారు.ఆమె తన తల్లిదండ్రులను విడిచి ఉండటానికి నిరాకరించడంతో కొడుకు, కోడలు మధ్య గొడవలు జరిగేవని ఈ క్రమంలోనే బల్జీందర్ నాలుగైదు నెలలు అత్తమామలతో కలిసే ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.

ఈ సమయంలో తమ కుమారుడిని అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు వేధింపులకు గురిచేశారని నారాయణ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో అతడిని వారి ఇంటి నుంచి బయటకు గెంటేశారని, అనంతరం తమ కోడలు విడాకులు కావాలని, భరణం కింద రూ.2 కోట్లు ఇవ్వాలని తల్లిదండ్రులతో కలిసి వేధించడం మొదలు పెట్టిందని ఆయన చెప్పారు.ఊరిలో ఉన్న రెండు ఎకరాల భూమి తమ పేరు మీద రాయాలని వేధించడంతో పాటు పాస్‌పోర్ట్, పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్‌ను లాక్కొన్నారు నారాయణ్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఆస్తులను తమ పేరిట రాసే వరకు పాస్‌పోర్ట్, పీఆర్ కార్డును ఇవ్వమంటూ బల్జీందర్‌ను మానసికంగా వేధించారని ఆయన చెప్పారు.

దీంతో పాటు తమ కోడలికి గతంలోనే పెళ్లి అయ్యిందని, మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుందని… ఆ సమయంలో అతని నుంచి రూ.40 లక్షలు వసూలు చేసినట్లు కూడా తమకు తెలిసిందని సింధు అన్నారు.ఈ విషయాన్ని దాచి పెట్టి బల్జీందర్‌ను వివాహం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు అతని చావుకు కారణమయ్యారని నారాయణ్ సింగ్ ఆరోపించారు.

తమ కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, బల్జీందర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించాలని నారాయణ్ సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Baljinder Singh Indian National commits suicide in canada
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube