డైల‌మాలో జ‌గ‌న్ మామ‌.... పోటీ చేయాలా...వ‌ద్దా..!       2018-06-03   23:46:44  IST  Bhanu C

ప్ర‌కాశం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల‌ రెడ్డి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు. జ‌గ‌న్ శ్రీనివాసుల రెడ్డిని వాసూ మామా అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. వైసీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జిల్లా వ‌ర‌కు వాసు ఏం చెపితే అదే జ‌రిగేది. అయితే గ‌త ఎన్నిక‌ల‌ప్ప‌టి నుంచి సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీనివాసుల‌రెడ్డి ఓడిపోతే ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసిన జ‌గ‌న్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డి విజ‌యం సాధించ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాల‌కు తెర‌లేచింది.

-

బాలినేని ఓట‌మి సుబ్బారెడ్డి గెలుపు త‌ర్వాత జిల్లాలో పార్టీ ఆధిప‌త్యాన్ని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు వైవి ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక్క‌డే ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌మైన విబేధాలు వ‌చ్చాయి. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశాన‌ని… సుబ్బారెడ్డి ఎవ‌ర‌ని బాలినేని ప్ర‌శ్నిస్తుంటే… ప్ర‌జాక్షేత్రంలో గెలిచిన వాళ్ల‌దే రాజ్యం అని… తాను ఒంగోలు ఎంపీగా గెలిచాను కాబ‌ట్టి జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్న‌ట్టుగా వైవి వ్య‌వ‌హరిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న పార్టీ నేత‌ల వ‌ద్దే నేరుగా ప్ర‌స్తావించారు.

సుబ్బారెడ్డి తీరుపై బాలినేని జ‌గ‌న్‌కు రెండు మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఆయ‌న మాత్రం స‌ర్దుకుపోవాల‌ని చెప్ప‌డంతో వాసు తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన‌ట్టు అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో చూస్తే ఒంగోలు లోక్‌సభ స్థానానికి సిటింగ్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ తిరిగి పోటీ చేయనున్నారు. ఎంపీ ప‌రిధి ఏడు అసెంబ్లీ సీట్ల‌లో ఉంటుంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో మెజార్టీ రాక‌పోయినా సుబ్బారెడ్డి గెలిచారు. ఇప్పుడు అదే ఆయ‌న ధీమా.

ఒంగోలులో ఉన్న సుబ్బారెడ్డి వ‌ర్గం స‌హ‌క‌రించ‌క‌పోతే బాలినేని గెలుపు అంత సులువు కాదు. పైగా అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ బ‌లంగా ఉన్నారు. దీంతో ఆయ‌న తాను ఒంగోలులో పోటీ చేయ‌న‌ని… జిల్లా ప‌శ్చిమ ప్రాంత‌మైన గిద్ద‌లూరు లేదా మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని కూడా జ‌గ‌న్‌కు చెప్పారు. జ‌గ‌న్ బాలినేని మాట‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీలో ఉన్నా అంటీముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు. ఏదేమైనా మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ వాసూ మామ‌ను ఎలా బుజ్జ‌గిస్తారో ? చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.