రఘురామకృష్ణరాజు ఓ సైకో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ?

ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘటన చోటు చేసుకుంది.ఇప్పటి వరకు అధికార పార్టీ వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఈరోజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 Balineni Comments On Mp Raghurama Krishna Raju-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఈ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ అంశం పై స్పందిస్తూ పలు సంచలన వాఖ్యలు చేశారు.ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ బొమ్మతో గెలిచి, ఇప్పుడు ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని మండిపడుతూనే, రఘురామకృష్ణరాజును సైకో అని అభివర్ణించారు.

అయితే వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు మొదటి నుండి సొంత పార్టీకి, జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారాడు.నేరుగా జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినా భరించాడు.

 Balineni Comments On Mp Raghurama Krishna Raju-రఘురామకృష్ణరాజు ఓ సైకో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ప్రస్తుతం చట్టం తనపని తాను చేసుకుంటుందని, సొంత యింటి వాసాలు లెక్కపెట్టే వారు బయట ఉంటే ప్రమాదం అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారట.

#Balineni #MPRaghurama #Comments #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు