సొంత పార్టీలో కొందరు వ్యక్తులు తనపై కుట్ర చేస్తున్నారని వాళ్ళ అంతు చూస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఒంగోలులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒంగోలు నియోజకవర్గ వైసిపి ప్లీనరీ సమావేశంలోబాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
టిడిపి నేత జనార్దన్ కావాలనే తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నాడని…కాల్ డేటా తెప్పించి అందరి సంగతి చూస్తానని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరో ఒక వ్యక్తి జనసేన మహిళాకు ఫోన్ చేస్తే బాలినేని తాగి ఫోన్ చేశాడు అని తప్పుడు ప్రచారం చేశారని.
నేను ఏమైనా తప్పు చేస్తే ప్రజల ముందు తల దించుకుని రాజకీయాలకు దూరంగా వెళ్తానని తెలిపారు.తనపై కుట్ర చేస్తున్నవారు పద్ధతి మార్చుకోకపోతే కాళ్ళు విరుస్తానని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ టిడిపిని ప్రశ్నించడు కానీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ప్రశ్నిస్తారని అని అన్నారు.







