కరోనా ఎఫెక్ట్.. కూరగాయలమ్ముతున్న ప్రముఖ సీరియల్ డైరెక్టర్!

దేశంలో ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది.సినిమా, టీవీ రంగాల్లో గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి.

 Balika Vadhu Assitant Director Ram Vriksha Gaur Selling Vegetables Due To Corona-TeluguStop.com

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాలు, సీరియళ్ల విషయంలో నిబంధనలు సడలిస్తున్నా పలు సీరియల్ యూనిట్లు షూటింగ్ లను స్టార్ట్ చేయాలంటే భయపెడుతున్నాయి.ఒకరికి వైరస్ సోకినా యూనిట్ మొత్తానికే వైరస్ సోకే ప్రమాదం ఉండటం సినిమా, సీరియల్ నిర్మాతలను టెన్షన్ పెడుతోంది.

దీంతో ఆయా రంగాల్లో పని చేసే వాళ్లు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.జీవనోపాధి కోల్పోవడంతో కొందరు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏదో ఒక వృత్తిపై ఆధారపడుతున్నారు.

తాజాగా బాలికా వ‌ధు సీరియల్ డైరెక్టర్లలో ఒకరైన రామ్‌ వ్రిక్ష గౌర్‌ కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నాడు.తెలుగులో సూపర్ హిట్టైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఒరిజినల్ వెర్షన్ బాలికా వధు.

కలర్స్ టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

తోపుడు బండిపై బాలికా వధు డైరెక్టర్ కూరగాయలు అమ్మడం తెలిసి ఆయన అభిమానులు బాధ పడుతున్నారు.

లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు రామ్ తన సొంతూరైన అజంఘ‌డ్‌కు వెళ్లారు.రామ్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు కావాల్సి ఉండగా కరోనా వల్ల మోదీ లాక్ డౌన్ ప్రకటించడం, సినిమా ఆగిపోవడం జరిగాయి.

దీంతో తండ్రి వ్యాపారమైన కూరగాయల బండిని తీసుకుని రామ్ కూరగాయలు అమ్ముతున్నాడు.

కూరగాయలు అమ్ముతున్నందుకు సిగ్గుగా లేదని.తాను బాధ పడటం లేదని ఆయన చెప్పుకొచ్చారు.2002 సంవత్సరంలో లైట్ డిపార్టుమెంట్ లో కెరీర్ మొదలుపెట్టిన రామ్ అంచెలంచెలుగా డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.ముంబైలో రామ్ కు సొంత ఇల్లు ఉంది.అయితే బాలికావధు లాంటి గొప్ప సీరియల్ డైరెక్టరే ఇలాంటి పరిస్థితిలో ఉంటే లాక్ డౌన్ వల్ల సామాన్య, పేద ప్రజల పరిస్థితి ఇంకెంత మారిపోయిందో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube