బాలయ్య బాబు విక్రమ సింహ భూపతిని ఓటీటీలో రిలీజ్ చేయాలంటా  

Balayya\'s Vikramasimha Plan to OTT Release, Tollywood, Digital Entertainment, Web Channels, Nandamuri Fans, Narthanasala - Telugu #narthanasala, Balayya, Digital Entertainment, Nandamuri Fans, Ott Release, Tollywood, Vikramasimha, Web Channels

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో గతంలో ప్రారంభమై కొంత షూటింగ్ జరిగి ఆగిపోయిన సినిమా నర్తనశాల.ఈ సినిమాలో దివంగత నటి సౌందర్య ద్రౌపది పాత్రలో నటించింది.

TeluguStop.com - Balayyas Vikramasimha Plan To Ott Release

ఆమె అకస్మాత్తుగా మరణించడంతో సినిమా కూడా అర్ధంతరంగా ఆగిపోయింది.సౌందర్యని రిప్లేస్ చేసే నటి ఆ సమయంలో లేకపోవడంతో బాలకృష్ణ వెనక్కి తగ్గారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూట్ చేసిన సన్నివేశాలని ఎడిట్ చేసి 17 నిమషాల నిడివి ఉన్న ఫుటేజ్ ని ఎటీటీ ద్వారా రిలీజ్ చేశారు.ఒక చారిటీ కోసం ఈ సినిమా రిలీజ్ చేసినట్లు బాలకృష్ణ తెలిపాడు.

TeluguStop.com - బాలయ్య బాబు విక్రమ సింహ భూపతిని ఓటీటీలో రిలీజ్ చేయాలంటా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా నర్తనశాల సినిమా గురించి చాలా విషయాలు బాలయ్య మీడియాతో పంచుకున్నారు.ఇదిలా ఉంటే బాలకృష్ణ కెరియర్ లో అలాగే మరో సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కాకుండా ఆగిపోయింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా విక్రమ సింహ భూపతి అనే పీరియాడికల్ సినిమా తెరకెక్కింది.భైరవద్వీపం తర్వాత ఈ సినిమా తెరకెక్కగా అందులో రోజా, పూజాబత్రా హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాని అప్పట్లో భారీ బడ్జెట్ తో గోపాల్ రెడ్డి నిర్మించారు.80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.అయితే అకస్మాత్తుగా నిర్మాత చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.తరువాత కోడి రామకృష్ణ ఆ సినిమాని రిలీజ్ చేయాలని చాలా సందర్భాలలో అనుకున్నారు కాని కుదరలేదు.అయితే ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని ఎక్కడో మూలాన పడిన సినిమాలు కూడా బయటకి వస్తున్నాయి కాబట్టి విక్రమ సింహ భూపతి సినిమాని ఎడిట్ చేసి రిలీజ్ చేయాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరి ఫ్యాన్స్ కోరికని మన్నించి బాలయ్య ఆ దిశగా ఆలోచిస్తాడేమో చూడాలి.

##Narthanasala #Vikramasimha #Balayya #Web Channels #OTT Release

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balayyas Vikramasimha Plan To Ott Release Related Telugu News,Photos/Pics,Images..