నిరుపేద వృద్దుడితో కాళ్లు మొక్కించుకుంటున్న బాలక్రిష్ణ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..అసలు విషయం తెలిస్తే.!     2018-10-05   13:10:30  IST  Rajakumari K

బాలక్రిష్ణ పేరు వింటేనే హడలిపోయేలా ఉన్నారు జనం..అందుకు కారణం లేకపోలేదు..బాలయ్యకు చేతివాటం ఎక్కువని ఇటీవల జరిగిన అనేక సంఘటనలు నిరూపించాయి..సెల్ఫీ దిగడానికి వెళ్లిన అతన్ని లాగి పెట్టి కొట్టడం దగ్గర మొదలు పెడితే నిన్నా మొన్న కార్లో వెళ్తున్న బాలయ్యని ఫోటో తీయడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని బెదిరించిన ఘటన వరకు బాలక్రిష్ణ పట్ల భయం కలగడానికి కారణాలు..అయితే ఇప్పుడు బాలక్రిష్ణకి ఒక నిరుపేద కాళ్లు మొక్కుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది..ఆ ఫోటో వెనుక అసలు విషయం ఏంటంటే..

వైరల్ అవుతున్న ఫోటో హంసల దీవిలో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నప్పటిది అని అర్దం అవుతుంది..ఆ ఫోటోలో ఉన్నది ఏంటంటే షూటింగ్ లొకేషన్ లో ఓ నిరుపేద వృద్ధుడు బాలయ్య కాళ్లకు మొక్కుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న అతడు బాలయ్య వద్దకు వెళ్లి తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాని, సాయం చేయాలని అర్థించగా. వెంటనే స్పందించిన బాలయ్య బసవతారకం క్యాసర్ ఆసుపత్రికి ఫోన్ చేసి ఆ వృద్ధుడి వివరాలు తెలియజేయడమే కాదు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాడట. బాలయ్య అందించిన సాయంతో ఆ వృద్ధుడు సంతోషంలో మునిగిపోయాడు. వెంటనే బాలయ్య కాళ్లకు మొక్కాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఇటీవల బాలయ్య తెలంగాణాలో పర్యటించిన సందర్భంగా అభిమానులపై చేయి చేసుకున్న వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలయ్య అభిమానులే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు…కాగా ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ బాలయ్యబాబు మంచితనాన్ని పొగుడుతున్నారు.