తన సినిమా పలికిన రేటుకు తానే ఆశ్చర్యపోయిన బాలయ్య!  

Balayya\'s Ntr Biopic A Hot Property For Distributors-

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’.ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయబోతున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ ఎత్తున చిత్రీకరణ జరుపుతున్నారు..

Balayya\'s Ntr Biopic A Hot Property For Distributors--Balayya's NTR Biopic A Hot Property For Distributors-

ఈ చిత్రంలో బాలకృష్ణ మాత్రమే కాకుండా ఇంకా పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నారు.ఆ కారణంగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకం సినీ వర్గాల నుండి వ్యక్తం అవుతుంది.

బాలకృష్ణ ఈ చిత్రంపై నమ్మకంతో స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చిన కారణంగా ఆయనకు లాభాల పంట పండటం ఖాయంగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా బిజినెస్‌ జరుగుతున్న తీరు చూస్తుంటే నిర్మాత బాలకృష్ణకు విడుదలకు ముందే దాదాపు 40 నుండి 50 కోట్ల వరకు లాభాలు దక్కే అవకాశం ఉందనిపిస్తుంది.బాలయ్య కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి లెక్కలు నమోదు కాలేదు.ఎప్పుడు కూడా 20 నుండి 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడం, అంతకు తక్కువ బిజినెస్‌ అవ్వడం మాత్రమే చూశాం.కాని ఈసారి మాత్రం బాలకృష్ణను కాకుండా ఎన్టీఆర్‌ను బయ్యర్లు చూస్తున్నారు.క్రిష్‌ దర్శకత్వంపై నమ్మకం కలిగి ఉన్న ప్రేక్షకులు మరియు బయ్యర్లు సినిమాపై ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక ఈ చిత్రం అమెజాన్‌ చేతిలోకి వెళ్లింది.ప్రైమ్‌ వీడియో రైట్స్‌ను అమెజాన్‌ ఏకంగా 20 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.బాలీవుడ్‌ చిత్రాలు మాత్రమే ఈస్థాయిలో రైట్స్‌ ధర పలుకుతాయి.కాని ఈ చిత్రం 20 కోట్లకు అమ్ముడు పోవడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

సినిమా బడ్జెట్‌లో సగం అమెజాన్‌ రైట్స్‌ ద్వారా రావడంతో అంతా అవాక్కవుతున్నారు.ఇక ఓవర్సీస్‌లో బాలయ్య ఇప్పటి వరకు సత్తా చాటలేదు.

క్రిష్‌ కారణంగా గౌతమి పుత్ర శాతకర్ణితో కాస్త పర్వాలేదు అనిపించాడు.కాని ఎన్టీఆర్‌ చిత్రంతో బాలయ్య ఏకంగా 15 కోట్లకు మార్కెట్‌ చేరుకున్నాడు.కేవలం ఓవర్సీస్‌ మరియు అమెజాన్‌ రైట్స్‌ ద్వారా 35 కోట్లు బాలయ్య దక్కించుకున్నాడు.తన సినిమా బిజినెస్‌ చూసి స్వయంగా బాలయ్య ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.