'డిక్టేటర్'గా బాలయ్య...

గత సంవత్సరం ‘లెజెండ్’ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న తరువాత ఈ సమ్మర్ రేసులో ‘లయన్’ గా గర్జించ బోతున్నాడు నటసింహం బాలయ్య.అయితే.

 Balayya’s 99th Movie Titled As Dictator-TeluguStop.com

ఇదిలా ఉండగా…బాలకృష్ణ 99వ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర వార్త ఫిలింనగర్ లో హలచల్ చేస్తుంది.విషయం ఏమిటంటే…‘లౌక్యం’ సినిమా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘డిక్టేటర్’ అనే టైటిల్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలయ్యకు విజయాలను ఇచ్చే సెంటిమెంట్ హీరోయిన్ గా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో కథ రీత్యా బాలకృష్ణది చాల పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఈ టైటిల్ ను ఈ సినిమా యూనిట్ ఎంచుకున్నారు అని టాక్.వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించ బోతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా కథ రీత్యా చాల భారీగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఇక వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి.ఇదే సంవత్సరం ఆగష్టు, సెప్టెంబర్ ప్రాంతాలలో విడుదలచేసి బాలయ్య 100వ సినిమాకు లైన్ క్లియర్ చేయాలని ఆలోచన అని అంటున్నారు.

ఇప్పటికే తన సినిమా టైటిల్స్ తో తన పవర్ ను పెంచేసుకుంటున్నబాలకృష్ణ తన 100వ సినిమాకు ఇంకా ఎంత పవర్ ఫుల్ టైటిల్ పెడతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube