కొత్త ఇంటిని కొనుగోలు చేసిన బాలయ్య... ధర ఎంతో తెలుసా?

నటసింహం బాలయ్య ఇటు రాజకీయాల్లో, ఇటు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.ఇటు రాజకీయాలలో తన నియోజకవర్గం ప్రజలతో అనుక్షణం మమేకమవుతూ, ఇటు హీరోగా రకరకాల పాత్రలు పోషిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు.

 Balayya Who Bought A New House Do You Know The Price , Balakrishna, Hero Balakri-TeluguStop.com

అయితే తాజాగా నటసింహం బాలయ్య గురించి ఓ వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.బాలయ్య తాజాగా అత్యంత ఖరీదైన ఓ కొత్త ఇంటిని బాలయ్య కొనుగోలు చేసాడట అని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో 15 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసాడు.అయితే రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెడుతూ ఇటు సినిమా రంగంలోనూ, రియల్ ఎస్టేట్ లోనూ బాగా సంపాదిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బీబీ3 వర్కింగ్ టైటిల్ తో బాలయ్య నటిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇంకా రాకపోయినా బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిలో కొత్త రకం కథలను ఎంచుకుంటున్న బాలయ్య యువ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారనే చెప్పవచ్చు.రకరకాల పాత్రలు వేస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గేది లేదన్న విధంగా సినిమాలను ఎన్నుకోవడంలో కూడా బాలయ్య వైవిధ్యత చూపిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube