బాలయ్య వీక్ నెస్ గుర్తించిన డైరెక్టర్లు.. అవకాశాలు అందుకోవడం మరింత సులభం?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.

 Balayya Weakness Recognised Directors More Easy To Get Opportunities Details, Ba-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఈయన గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలోనూ, అనంతరం అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.ఇకపోతే తాజాగా బింబిసారా సినిమాతో మరో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్టతో కలిసి ఈయన సినిమా ఉండబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా బాలకృష్ణ పలువురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొందరు బాలకృష్ణ వీక్నెస్ గుర్తించినట్లు తెలుస్తోంది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు.

అయితే రవితేజ నటించిన క్రాక్ సినిమా బాలకృష్ణ కోసం స్పెషల్ షో వేసి చూపించారు.ఈ సినిమా బాలయ్యకు అమితంగా నచ్చడంతో వెంటనే డైరెక్టర్ గోపీచంద్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఎఫ్ త్రీ సినిమాలు చూసి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

Telugu Anil Ravipudi, Balayya, Balayyavasisht, Bimbisara, Vaiata-Movie

తాజాగా బింబిసారా సినిమా చూసిన బాలకృష్ణ డైరెక్టర్ వశిష్టతతో కూడా సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే బాలకృష్ణతో డైరెక్టర్లు సినిమా అవకాశాలను అందుకోవాలని అతని చుట్టూ స్క్రిప్టులు పట్టుకొని తిరగాల్సిన పనిలేదని వారు తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలను బాలయ్యకు చూపిస్తే చాలు సినిమా నచ్చితే తప్పకుండా అవకాశం ఇస్తారు అంటూ పలువురు బాలకృష్ణ వీక్ నెస్ క్యాష్ చేశారు.ఇలా ఈయన వీక్ నెస్ తెలుసుకున్న డైరెక్టర్లు ప్రస్తుతం ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని,ఇకపై బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం పొందాలంటే మరింత సులభం అవుతుంది అంటూ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube