Balakrishna Unstoppable : స్టార్ హీరో బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోయిందా.. ఇదే ప్రూఫ్ అని చెబుతూ?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) మొట్టమొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షో చేయకముందు వరకు కేవలం హీరోగా అలరించిన బాలకృష్ణ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనలో ఉన్న మరొక కోణాన్ని కూడా బయట పెట్టారు.

 Balayya Unstoppable Stopped-TeluguStop.com

ఇకపోతే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అయితే ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్‌ షో మూడో సీజన్‌కి సన్నద్ధమవుతోంది.

అయితే సీజన్‌ 3 ప్రారంభం కాకముందే భగవంత్‌ కేసరి, యానిమల్‌ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమాలకు స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించారు బాలకృష్ణ.

Telugu Animal, Balakrishna, Tollywood, Unstoppable-Movie

మూడో సీజన్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది, అందులో గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారు, వంటి ఆసక్తికరమైన అంశాల గురించి మీడియాలో, సోషల్‌ మీడియాలో( Social media ) విపరీతమైన చర్చలు కొనసాగుతున్నాయి.అయితే త్వరలోనే సీజన్‌ 3ని( Unstoppable 3 ) ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని అందరూ భావించారు.కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే.

అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో ఆగిపోయిందా? అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.అలా రావడం వెనుక కారణం కూడా లేకపోలేదు.

అన్‌స్టాపబుల్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలోని ఒక ఫ్లోర్‌లో సెట్‌ వేశారు.

Telugu Animal, Balakrishna, Tollywood, Unstoppable-Movie

అయితే హఠాత్తుగా ఈ సెట్‌ను అక్కడి నుంచి తొలగించారు.దీంతో ఈ షో ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.అన్‌స్టాపబుల్‌ ( Unstoppable)అంటే ఎవ్వరూ ఆపలేనిది అని అర్థం.

కానీ, షో మాత్రం ఆగిపోయింది అంటూ రకరకాల కామెంట్స్‌ వినిపస్తున్నాయి.బాలకృష్ణ వరసగా సూపర్‌ హిట్‌ సినిమాలు చేస్తూ ఎంతో ఊపు మీద ఉన్నారు.

ఎంతో ఉత్సాహంగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఒకదాని వెంట మరొకటి అన్నట్టుగా వరసగా సినిమాలు చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube