ఒకే టైటిల్ తో తెరకెక్కిన శోభన్ బాబు బాలకృష్ణ సినిమాలు.. ఎవరి సినిమా హిట్ అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీని టైటిల్స్ కొరత ఎప్పుడూ వేధిస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే.ఈ రీజన్ వల్ల పెద్ద సినిమాల మేకర్స్ తో పాటు చిన్న సినిమాల మేకర్స్ కూడా కథకు సూట్ అయితే గతంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల టైటిల్స్ ను తమ సినిమాలకు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Balayya Shobhan Babu Movies With Same Title Who Is The Hit Who Is The Flop , Akh-TeluguStop.com

అలా శోభన్ బాబు, బాలకృష్ణ సినీ కెరీర్ లో ఒకే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలు ఉన్నాయి.

శోభన్ బాబు తల్లిదండ్రులు సినిమాలో నటించగా 1970 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.

సావిత్రి, జగ్గయ్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా కె బాబూరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

అయితే ఇదే టైటిల్ తో బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా తాతినేని రామారావు డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ విధంగా ఒకే టైటిల్ తో తెరకెక్కిన సినిమాల విషయంలో శోభన్ బాబు యావరేజ్ రిజల్ట్ ను అందుకుంటే బాలకృష్ణ మాత్రం సూపర్ హిట్ రిజల్ట్ ను అందుకున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నారు.

ఊరమాస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Telugu Akhanda, Balakrishna, Shobhan Babu, Tallidandrulu-Movie

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అఖండ సినిమాతో 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిన బాలకృష్ణ తర్వాత సినిమాలతో మరిన్ని కొత్త రికార్డులను సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube