ఆర్ఆర్ఆర్ కు పోటీ ఇచ్చేందుకు సిద్దమైన బాలయ్య.. సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో “అఖండ” సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

 Balayya Ready To Compete For Rrr Is It Possible-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను దసరా కానుకగా విడుదల కాబోతోందనే సమాచారం వినబడుతుంది.

 Balayya Ready To Compete For Rrr Is It Possible-ఆర్ఆర్ఆర్ కు పోటీ ఇచ్చేందుకు సిద్దమైన బాలయ్య.. సాధ్యమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దసరా కానుకగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదల కాబోతుందని దర్శకుడు అధికారిక విడుదల తేదీని ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు దసరా బరిలో నుంచి తప్పుకున్నాయి.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే దసరా బరినుంచి ఎన్నో సినిమాలు పక్కకు తప్పుకున్న బాలయ్య “అఖండ” మాత్రం రాజమౌళి “ఆర్ఆర్ఆర్” కి గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది.

Telugu Akhanda, Balayya, Boyapati Sreenu, Movie News, Rajamouli, Rrr, Tollywood News-Movie

ప్రస్తుతం బాలకృష్ణ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.ఇక ఇదివరకే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన “సింహ”, “లెజెండ్” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి.వీరి కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం అఖండ.

ఈ క్రమంలోనే అఖండ పై నందమూరి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.మరి ఈ చిత్రం విడుదలపై బోయపాటి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

#Balayya #Akhanda #Boyapati Sreenu #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు