బోయపాటి కి హ్యాండ్ ఇచ్చిన బాలకృష్ణ! జయసింహ దర్శకుడుతో మళ్ళీ  

బోయపాటికి హ్యాండ్ ఇచ్చిన బాలకృష్ణ. .

Balayya Not Interested To Plan Movie With Boyapati-

బాలకృష్ణకి టాలీవుడ్ లో పోగొట్టుకున్న క్రేజ్ ని తీసుకొచ్చి, బాలయ్యని ఎలా చూపించాలో, అతని ఫ్యాన్స్ బాలకృష్ణ నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటారు అలాంటి సినిమాలు తీసి అతని ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచేసాడు బోయపాటి శీను, బాలయ్యతో తెరకెక్కించిన సింహా, లెజెండ్ అతని కెరియర్ లో బెస్ట్ చిత్రాలలో రెండుగా చెప్పుకోవచ్చు.ఇదిలా ఉంటే బోయపాటికి చివరిగా మెగా హీరో రామ్ చరణ్ తో వినయ విదేయ రామాతో డిజాస్టర్ మూవీ ఖాతాలో చేరిపోయింది.

Balayya Not Interested To Plan Movie With Boyapati--Balayya Not Interested To Plan Movie With Boyapati-

సినిమాలో కంటెంట్ కంటే అనవసరమైన అతి ఉండటం మెగా ఫ్యాన్స్ కూడా సినిమాని ఆస్వాదించలేకపోయారు.ఇక ఆ సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బాలకృష్ణ పిలిచి మరీ బోయపాటికి నెక్స్ట్ సినిమా అవకాశం ఇచ్చాడు.

ఇక ఈ సినిమా త్వరలో పట్టాలెక్కే టైంలో ఊహించని విధంగా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బోయపాటిని కలవరపెడుతుంది.ప్రస్తుతం బాలకృష్ణ మరో సారి సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

త్వరలో ఈ సినిమాని పట్టాలెక్కించడానికి బాలయ్య రెడీ అయిపోయాడు.ఇక బోయపాటి సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తుంది.దీనికి కారనంగ్ డిజాస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకోవడమే అని తెలుస్తుంది.ఒకే తరహా కథలని తిప్పి తిప్పి తీస్తున్న బోయపాటి మళ్ళీ బాలకృష్ణతో కూడా అలాంటి కథనే ఆవిష్కరిస్తే ఎన్టీఆర్ తో దెబ్బ తిన్న బాలయ్య ఇమేజ్ ఇంకా పడిపోయే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ ఒత్తిడి తేవడంతో బాలకృష్ణ బోయపాటి విషయంలో వెనక్కి తగ్గాడనే టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది వారిలో ఎవరో ఒకరు చెప్పేంత వరకు సస్పెన్స్ గానే ఉంటుంది.