రూలర్‌గా రాజ్యమేలతానంటున్న బాలయ్య  

Balayya Next Movie Title Confirmed Ruler-balayya,ks Ravikumar,ruler,sonal Chauhan,vedika

నందమూరి బాలకృష్ణ నటిస్టున్న తాజా చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో బాలయ్య అభానుల సందడి మొదలయ్యింది.

Balayya Next Movie Title Confirmed Ruler-balayya,ks Ravikumar,ruler,sonal Chauhan,vedika-Balayya Next Movie Title Confirmed Ruler-Balayya Ks Ravikumar Ruler Sonal Chauhan Vedika

అటు బాలయ్య ఈ సినిమాలో సరికొత్త అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడు.కొత్త గెటప్‌లో బాలయ్య లుక్ కేక అంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.కాగా బాలయ్య సినిమాకు టైటిల్ ఏమిటా అనే విషయంపై ఇప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి.

Balayya Next Movie Title Confirmed Ruler-balayya,ks Ravikumar,ruler,sonal Chauhan,vedika-Balayya Next Movie Title Confirmed Ruler-Balayya Ks Ravikumar Ruler Sonal Chauhan Vedika

ఈ సినిమాకు రూలర్, జడ్జిమెంట్ అనే టైటిల్‌లు పరిశీలినలో ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా టైటిల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా కథకు రూలర్ అనే టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ అని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.అటు బాలయ్య అభిమానులు కూడా ఇదే టైటిల్ అయితే సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అంటున్నారు.

తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.