నందమూరి బాలకృష్ణ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో బాలయ్య మాట్లాడుతూ నెక్స్ట్ తను చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు.
ప్రస్తుతం బోయపాటి అఖండ లో నటిస్తున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ ఉండబోతుందని వెల్లడించారు.అలాగే ఆ తరువాత అనిల్ రావిపూడి తో ఓ చిత్రం హాసిని అండ్ హారిక బేనర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు.
అప్పటి నుంచి బాలయ్య, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అని ప్రచారం ఊపందుకుంది.
దానికి కారణం హాసిని అండ్ హారిక బేనర్ లో ఇంతవరకూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రమే ఎక్కువ సినిమాలు చేశారుు.
అందుకేేే బాలయ్యతో త్రివిక్రమ్ తో సినిమా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. బాలయ్య బాబు త్రివిక్రమ్ కలిస్తే ఇండస్ట్రీ హిట్ ఇస్తారని దాంతో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు ఈ చిత్రం పై అభిమానుల అంచనాలు కూడా ఆకాశంలోకిఅయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అటు బాలయ్య గాని ఇటు త్రివిక్రమ్ గాని స్పందించలేదు.
అభిమానులు మాత్రం ఈ కాంబో వర్కవుట్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు.త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.