బాలయ్యతో హిట్ కాదు.. హ్యాట్రిక్ కొట్టిన దర్శకుల లిస్ట్ ఇదే?

జై బాలయ్య జై జై బాలయ్య.ఇదేంటి అనుకుంటున్నారు కదా నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక అభిమాని కూడా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతూ ఇక తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 Balayya Hatrick Directors   Balakrishna, Kodi Ramakrishan, B.gopal , Mangamma Ga-TeluguStop.com

ఇదే సమయంలో ఇక బాలయ్య సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.కాగా ఇప్పుడు వరకు బాలయ్య తో హిట్ కొట్టిన దర్శకుడు చాలామంది ఉన్నారు.

కానీ హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బాలయ్య హీరోగా 1984లో మంగమ్మగారి మనవడు మంచి సూపర్ హిట్ అయ్యింది.ఇక ఆ తర్వాత 1986లో ముద్దుల కృష్ణయ్య సినిమా బంపర్ విక్టరీ సాధించింది.1987లో మువ్వా గోపాలుడు అనే సినిమా కూడా హిట్ కొట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.అయితే బాలయ్య నటించిన ఈ మూడు సినిమాలకు కూడా దర్శకుడు కోడి రామకృష్ణ కావడం గమనార్హం.ఇలా బాలయ్యతో సినిమా తీసి కోడి రామకృష్ణ హ్యాట్రిక్ కొట్టాడు.

Telugu Akhanda, Gopal, Balakrishna, Boyapati, Legend, Mangammagari, Simha-Latest

ఇక బాలయ్య తో హ్యాట్రిక్ కొట్టిన దర్శకులలో బి.గోపాల్ కూడా ఉన్నారు.అప్పట్లో ఈయన అసలు సిసలైన యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.1990లో వచ్చిన లారీ డ్రైవర్, 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్, ఇక 1999లో వచ్చిన సమరసింహా రెడ్డి సినిమాలు బాలయ్య కెరీర్ ని పీక్స్ లో నిలబెట్టాయి.ఈ సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి.ఇక ఈ సినిమాలతో పాటు బాలయ్యకు హ్యాట్రిక్ అందించాడు బి.గోపాల్.అంతేకాదు వీరి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా నరసింహనాయుడు కూడా సక్సెస్ సాధించడం గమనార్హం.ఇక బాలయ్య కు హ్యాట్రిక్ అందించిన మరో దర్శకుడు బోయపాటి.2010లో సింహా సినిమాతో బాలయ్యకు హిట్ ఇచ్చిన బోయపాటి.2014లో లెజెండ్ సినిమా తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు.ఇక 2021లో అఖండ సినిమాతో బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందించి బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకుడు గా నిలిచాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube