తొమ్మిదిమంది హీరోయిన్లతో రొమాన్స్ చేసిన బాలయ్య.. ఏ సినిమాలోనో తెలుసా?

ఒక సినిమా అంటే అందులో ఒక హీరో ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది.అలా ఆ సినిమా మొత్తం ఆ హీరో హీరోయిన్ మధ్య సంభాషణలతోనే కొనసాగుతుంది.

 Nandamuri Balakrishna Romance With Nine Heroines, Nandamuri Balakrishna ,senior Ntr, Balakrishna Romance With Nine Actresses, Senior Ntr Biopic, Kathanayakudu , Nithya Menon, Anushka, Payal Rajput, Vidya Balan-TeluguStop.com

ఒకప్పుడు సినిమాలలో ఒక్కరే హీరోయిన్, ఒక్కరే హీరో మాత్రమే ఉండేది.ఇక ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతున్న కొద్దీ సినిమాలలో ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్లను కూడా పరిచయం చేశారు.
ఇక ఆ తర్వాత ముగ్గురు, నలుగురు హీరోయిన్ గానే కాకుండా ఏకంగా తొమ్మిది మంది హీరోయిన్ లను కూడా ఒకే సినిమాపై పరిచయం చేశారు.సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్ మాత్రమే ఉంటుంది.

కాబట్టి ఎంత ఖర్చయినా హీరోయిన్ ల విషయంలో అసలు తగ్గరు దర్శక నిర్మాతలు.ఇక తొమ్మిది మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో కాదు బాలయ్య.

 Nandamuri Balakrishna Romance With Nine Heroines, Nandamuri Balakrishna ,Senior NTR, Balakrishna Romance With Nine Actresses, Senior NTR Biopic, Kathanayakudu , Nithya Menon, Anushka, Payal Rajput, Vidya Balan-తొమ్మిదిమంది హీరోయిన్లతో రొమాన్స్ చేసిన బాలయ్య.. ఏ సినిమాలోనో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంత వరకు ఏ హీరో కూడా ఇంత మంది హీరోయిన్ లతో నటించలేదు.నాగార్జున కూడా పది మంది హీరోయిన్ లతో ఒక సాంగ్ లో మాత్రమే కనిపించాడు.

అలా చాలా వరకు ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ ల తోనే నటించారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న బాలయ్య ఓ సినిమాలో మొదటి సారిగా తొమ్మిది మంది హీరోయిన్ లతో నటించాడు.

ఇంతకు అది ఏ సినిమాలోనో తెలుసుకుందాం.

ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ గా దూసుకెళ్తున్న నందమూరి బాలయ్య వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

నాటి నుండి నేటి వరకు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.ఇక ఆ తరం హీరోయిన్ లనే కాకుండా ఈ తరం హీరోయిన్ లను కూడా అసలు వదలడం లేదు బాలయ్య.

ఇదిలా ఉంటే ఈయన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే.క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించారు.మొదటి భాగం కథానాయకుడిగా తెరకేక్కగా అందులో

ఏకంగా తొమ్మిది మంది హీరోయిన్ లను బాలయ్యతో రొమాన్స్

చేయించాడు డైరెక్టర్.ఇందులో ఎన్టీఆర్ సినీ జీవితం ఉండగా తనతో నటించిన హీరోయిన్ ల స్థానంలో కొంత మంది యంగ్ హీరోయిన్ లను తీసుకున్నాడు.

అందులో ఎవరు ఉన్నారంటే.ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించింది.శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతంగా నటించింది.నిత్యా మీనన్ ను సావిత్రిగా చూపించారు.సరోజా దేవి పాత్రలో అనుష్క నటించింది.ఇక శాలిని పాండే కూడా నటించగా అందులో ఆమె షావుకారు జానకిగా అద్భుతంగా నటించింది.

హన్సిక కూడా ఈ సినిమాలో ఒక భాగం అయింది.అందులో తాను జయప్రద పాత్రలో నటించింది.మాళవిక నాయర్ జయసుధగా, పాయల్ రాజ్ పుత్ కృష్ణకుమారి గా నటించింది.మొత్తానికి ఈ సినిమాలో బాలయ్య సరసన ఇంత మంది హీరోయిన్ లు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు బాలయ్య.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube